Featured

Senior Journalist Imandhi Ramarao : అన్నమయ్య వారసురాలా?? జగన్ కి అంతగా నచ్చిందా?? ఆమె ఉత్త మట్టి సుద్ద… సింగర్ మంగ్లీకి జగన్ కీలక పదవి పై ఇమంది రామారావు షాకింగ్ కామెంట్స్…!

Senior Journalist Imandhi Ramarao : తెలంగాణ జానపద గీతాలు ముఖ్యంగా బోనాలకు సంబంధిచిన పాటలతో బాగా ఫేమస్ అయిన ‘సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ’కి ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రముఖ భక్తి ఛానెల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ‘ఎస్విబిసి’ కి కీలక సలహాదారు పదవిని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మర్చిలోనే వచ్చినా ఇన్నాళ్లు గోప్యంగా ఉంచి ఇప్పుడు మంగ్లీ పదవీ బాధ్యతలు స్వికరించారు. ఇక అనంతపురం జిల్లా గుత్తి దగ్గర బసినేపల్లి తాండాకు చెందిన సత్యవతి తెలంగాణ యాస పాటలతో న్యూస్ ఛానెల్స్ లో మంగ్లీ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, కన్నడ భాషల్లో పాటలు పడుతూ ఫేమస్ అయిన మంగ్లీ 2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ కి ప్రచార గీతాలు ఆలపించింది. మంగ్లీ తాజాగా ఎస్విబిసి సలహాదరు గా బాధ్యతలు స్వికరించగా ఆమెకు నెలకు లక్షరుపాయల జీతం అలాగే తిరుమల వచ్చినపుడు బ్రేక్ ఎంట్రీ దర్శనం, వాహనంతో కూడిన వసతి కల్పిస్తారు. ఇక ఈ పదవి లో మంగ్లీ రెండేళ్లు ఉండనున్నారు. అయితే మంగ్లీ నియామకం గురించిన వార్త బయటికి రాగానే చాలా మంది శుభాకాంక్షలు చెబుతున్నారు అలాగే విమర్శిస్తున్నారు కూడా. ఇక ఈ ఇష్యూ మీద ఇమంది రామరావు గారు కూడా స్పందించారు.

మంగ్లీ కి అసలు అన్నమయ్య కీర్తనలైనా వచ్చా.. ఆమెకు ఏమి అర్హత ఉంది…

మంగ్లీకి ఎస్విబిసి సలహాదరుగా పదవి గురించి మాట్లాడుతూ ఇమంది గారు ఫైర్ అయ్యారు. అసలు ఆమెకు ఉన్న అర్హత ఏమిటి ఆ పదవి ఇవ్వడానికి, ఎందరో అన్నమయ్య కీర్తనలను ఆలపించేవారు, ఉద్ధండులు ఉండగా ఆమెకు పదవి ఎలా ఇస్తారు. ఇది జగన్ అనాలోచిత నిర్ణయం అంటూ మాట్లాడారు. రోజా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తుండటం వల్ల ఆమె రిఫరెన్స్ తో ఈ పదవి ఇచ్చినట్టున్నారు, రోజా కైనా తెలియదా అన్నమయ్య సినిమాలో నటించింది కదా..

అన్నమయ్య గొప్పతనం, ఆయన వేంకటేశ్వరస్వామి కోసం ఎన్ని కీర్తనలను రాసారో ఇవన్నీ ఆ మంగ్లీకి కొంతైనా అవగాహన ఉందా?? ఇవేవి ఆలోచించకుండా పదవి ఇచ్చారంటే జగన్ కి ఆమె అంటే ప్రత్యేక ఆకర్షణ ఉందా అంటూ ఫైర్ అయ్యారు ఇమంది గారు. ఇక మంగ్లీ ని కాకుండా ఎవరైనా పండితులను ఈ పదవిలో పెట్టుంటే ఛానెల్ అభివృద్ధికి దోహదపడుతుంది అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సినిమా రివ్యూలపై టాలీవుడ్ ఉక్కుపాదం..

కోర్టు ఆదేశాలతో ‘మెగా’ నిర్ణయం తెలుగు చలనచిత్ర పరిశ్రమ (TFI) చరిత్రలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సినిమాలపై సోషల్ మీడియాలో…

4 days ago

పరమ వైభవాల పురాణపండ శ్రీ విష్ణు సహస్రంను గాన సభ ఉచితంగా అందిస్తోంది..

ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…

1 week ago

Srimalika : బొల్లినేని చేతుల మీదుగా శైలజాకిరణ్‌కు పురాణపండ శ్రీమాలిక!

అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…

2 weeks ago

ఆల్‌టైం కనిష్టానికి రూపాయి… జనవరి నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ ధరల పెరుగుదల తప్పదా?

భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…

1 month ago

చలికాలంలో ‘షాక్’ కొడుతోందా? వస్తువులను తాకితే కరెంట్ తగిలినట్లు ఎందుకు అనిపిస్తుంది?

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…

1 month ago

యోగాకు ఏ సమయం ‘బెస్ట్’? ఉదయమా? సాయంత్రమా? నిపుణులు ఏమంటున్నారు?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…

1 month ago