Senior Journalist Imandhi Ramarao : ఎన్టీఆర్ అనగానే గొప్ప పౌరాణికాలు, అలాగే జానపద చిత్రాలు గుర్తుకువస్తాయి. ఆయన ఆ జోనర్స్ లో మరెవరూ సాహసించినటువంటి చిత్రాలను తన నటనతో రక్తి కట్టించారు. అప్పట్లో జానపదాలు, పౌరాణికాలు అంటే ఎన్టీఆర్, సాంఘిక చిత్రాలంటే ఏఎన్ఆర్ అనేలా వారి సినిమాలు సాగేవి. కానీ సాంఘిక సినిమాల్లో కూడా నేను మిన్న అని నిరూపించుకున్నారు ఎన్టీఆర్. వయసుమల్లిన పాత్రలో కనిపించి రిస్క్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆయన రాజకీయాల్లో కూడా ఎలాంటి ట్రెండ్ సెట్ చేశారో అందరికీ తెలిసిందే. అయితే ఆయన గురించి తెలిసిన ఎవరైనా ఆయన క్రమశిక్షణ ఆయనను అత్యున్నత స్థాయికి తీసుకువచ్చిందని భావిస్తారు. ఇక ఆయన జీవన సరళి గురించి ఆహారపు అలవాట్ల గురించి ఆయనను దగ్గర నుండి చూసిన సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఒక్క గంటలో పది సిగరెట్ ప్యాకెట్లు…
ఎన్టీఆర్ గారు మొదటి నుండి క్రమశిక్షణతో జీవించారు. షూటింగ్ ఎన్నింటికైనా కరెక్ట్ టైంకి అక్కడ ఉండేవారు. ఇతరులు లేట్ వచ్చినా దండించేవారు. ఇక ఆయన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ ఒకసారి రాత్రి పదిగంటల సమయంలో ‘సర్కస్ రాముడు’ సినిమా డబ్బింగ్ పనులు చెన్నైలో జరుగుతున్నాయి. మరో వైపు ‘శృంగార రాముడు’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఉదయం మూడు గంటలకల్లా పూర్తి చేసి శృంగార రాముడు షూటింగ్ వెళ్ళాలి. ఆయన రాత్రి పదిగంటలకు చెన్నై లోని భూహరి హోటల్ నుండి నాన్ వెజ్ క్యారేజ్ తెప్పిస్తే తిని ఒక కేజీ కలకండ స్వీట్ తిని అప్పుడు డబ్బింగ్ చెప్పారు. దాదాపు 130 బైట్ల డబ్బింగ్ రెండు గంటల సమయంలో త్వరగా చెప్పేసారు. మళ్ళీ ఒంటిగంట సమయంలో మళ్ళీ భోజనం చేసి ఒక అరకేజీ జీలేబి తిని మిగిలిన డబ్బింగ్ పూర్తి చేసి మళ్ళీ 2:30 కల్లా ఎయిర్ పోర్ట్ కి బయలుదేరారు అంత టైం సెన్స్ తో ఉంటారు ఎన్టీఆర్ అంటూ తెలిపారు. ఇక శృంగార రాముడు షూటింగ్ లో ఒక సీన్ కోసం దాదాపు 29 బాటిల్స్ ఆపిల్ జ్యూస్ ను తాగారు. అలానే 10 ప్యాకెట్ ల సిగరెట్స్ తాగారు కేవలం ఒక సీన్ కోసం అంత చేసారు అంటూ ఎన్టీఆర్ గొప్పతనం చెప్పారు ఇమంది గారు.

































