Senior Journalist Imandhi Ramarao : తాత వారసత్వం పునికి పూచ్చుకుని తాత పేరు తో పాటే పోలికలు అభినయం అందుకుని ప్రస్తుతం ఉన్న టాప్ హీరోస్ లో ఉన్న నందమూరి చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ సినిమాల్లో తన తాత కు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు. అయితే ఆ తాత నందమూరి ఎన్టీఆర్ కి సంబంధించిన ఎటువంటి వేడుకల్లో ఇటీవల కనిపించకపోవడం నందమూరి అభిమానుల్లో అనుమానలకు తావిస్తోంది. సినిమాల వరకే తాతపేరు చెప్పుకుంటారా నిజ జీవితంలో పట్టించుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిన ఆయన వెళ్ళలేదు. తాజాగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్బంగా కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణెం విడుదల చేసింది. ఈ వేడుకలోనూ జూనియర్ కనిపించలేదు. ఇక ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడారు.

ఎన్టీఆర్ ఎందుకు రాజకీవలకు దూరం….
జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు తరువాత టీడీపీ పగ్గాలను తీసుకుంటాడు అనే వార్తలు ఒకానొక సమయంలో బాగా వినిపించేవి లోకేష్ సమర్థత కంటే ఎన్టీఆర్ బాగా మాట్లాడగలడు అనే అభిప్రాయం టీడీపీ క్యాడర్ లోకూడా వినిపించేది. అయితే ఎన్టీఆర్ 2009 ఎన్నికల తరువాత పార్టీ కి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక తాత పేరు పెట్టుకుని సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో కనిపించలేదు. అలాగే కేంద్రం విడుదల చేసిన 100 రూపాయల నాణెం విడుదల వేడుకలకు హాజరు కాలేదు. ఇలా తాత వేడుకలకు జూనియర్ కు ఆహ్వానం ఉన్నా ఎందుకు వెళ్ళలేదనే సందేహం అందరిలోనూ ఉంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడు. టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల మీద ద్రుష్టి పెట్టాలని భావిస్తున్నాడు అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి రావడం మనుగడ సాధించడం అంత సులవైనా విషయం కాదు. పవన్ కళ్యాణ్ లాంటి క్రౌడ్ పుల్లర్ అయినా హీరోనే రాజకీయాల్లో కస్టపడుతున్నాడు. అలాంటపుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్న సక్సెస్ ను కాదని రాజకీయాల వైపు ఎందుకు చూస్తాడు అంటు ఇమంది అభిప్రాయపడ్డారు. పార్టీ లో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ కోసం అనునిత్యం కస్టపడి ప్రజల్లో ఉండే నేతలను చూసి జనాలు ఓట్లేస్తారు. అంతే కానీ సినిమా హీరో అనే చరిష్మా ఇప్పటి రాజకీయాలకు సరిపడదు అంటూ ఇమంది అభిప్రాయాపడ్డారు.

































