Senior journalist Imandhi Ramarao : తెలుగులో సంప్రదాయ నృత్యం, అభినయం, అలాగే అందం ఇవన్నీ కలగలిసిన హీరోయిన అనగానే భానుప్రియ గుర్తొస్తారు. హీరోలను సైతం డామినేట్ చేసేలా ఆమె నటన అలాగే డాన్స్ ఉంటుంది. ‘స్వర్ణ కమలం’ సినిమాలో ఆమెను తప్ప మరెవరినీ ఆ పాత్రలో ఉహించుకోలేము అంతలా ఆమె నటనతో హీరోని కూడా డామినేట్ చేసిన నటి భానుప్రియ. ఆమె స్వస్థలం రాజమండ్రి దగ్గర పల్లె. అయితే బ్రతుకు తెరువు కోసం ఆమె తల్లి దండ్రులు చెన్నై రాగా అక్కడే చదువుకున్న భానుప్రియ మంచి క్లాసికల్ డాన్సర్. ఇక ఆమె నృత్య ఆరంగేట్రంతోనే అందరి చూపు ఆమె మీద పడింది. వెను వెంటనే అవకాశాలతో కెరీర్ లో ముందుకు సాగింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది గారు మాట్లాడారు.

ఆమె భర్త చనిపోయి ఆర్ధిక ఇబ్బందులతో ఇంకా బాధపడుతోంది…
భానుప్రియ మొదటి సినిమా ‘సితార’ సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత వచ్చిన స్వర్ణ కమలం, అన్వేషణ, ఆలాపన సినిమాలలో తన డాన్స్ అలాగే నటనకు అందరినీ ఫిదా అయ్యేలా చేసాయి. ఇక కమర్షియల్ సినిమాల్లో కూడా మోడరన్ డాన్స్ తో హీరోలకు పోటీగా స్టెప్పులేసి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే పెళ్లి చేసుకున్న భానుప్రియ ఒక గ్రాఫిక్స్ డిజైనర్ ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది.

పాప అభినయ పుట్టాక కొన్నిరోజులకు భానుప్రియ తన భర్త తో విడిపోయి ఇండియా తిరిగి వచ్చేసింది మళ్ళీ సినిమాల్లో నటించింది. అయితే అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న భానుప్రియకు భర్త కూడా మరణించాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా ఆఫర్స్ రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇంట్లో ఉంటూ వచ్చిన కొద్ది ఆఫర్స్ తో జీవితం సాగిస్తోంది అంటూ భానుప్రియ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు చెప్పారు.
































