Senior Journalist Imandi Ramarao : మెగా ఫ్యామిలీలో అల్లు, అలాగే చిరు ఫ్యామిలీలు రెండూ వేరు వేరు కాదు అన్నట్లుగా ఇన్ని రోజులు ఉండేవి. అయితే గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీతో అంటి ముట్టనట్లుగా అల్లు కుటుంబం వ్యవహరిస్తోంది. అల్లు అర్జున్ తన మామ చిరంజీవి నీడ లేకుండా స్వతహాగా ఉన్నట్లుగా ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తనని తాను మెగా హీరోగా కంటే అల్లు ఫ్యామిలీ హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటుండగా మెగా అభిమానులలో కొంతమందికి ఇది రుచించడం లేదు. ఇక రామ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ ఎపుడో మొదలయింది. మొన్నామధ్య ట్విట్టర్ వేదికగా ఒకరినొకరు దూషించుకుంటూ బాగా ట్రెండ్ అయ్యారు. ఇక మళ్ళీ ఆ రెండు కుటుంబాల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయంటూ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు అభిప్రాయపడ్డారు.

చెర్రీ మీద గుర్రుగున్న అల్లు అరవింద్…
అల్లు అరవింద్ గారు చిరంజీవి గారి కెరీర్ లో ఎంతో ఉపయోగపడ్డారు అనడంలో సందేహం లేదు. అయితే ఆయన చిరు రాజకీయ జీవితంలో మాత్రం తప్పులను చేసారనే విమర్శ ఉంది. టికెట్లను అమ్ముకోవడం వంటివి చేసారనే విమర్శ అరవింద్ మీద ఉంది. అయితే ప్రస్తుతం చిరు కొడుకు రామ్ చరణ్ ఒకవైపు సక్సెస్ లో ఉంటే మరోవైపు అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు.

కాకపోతే ఇండియా లెవెల్లో పుష్ప మంచి ఇమేజ్ ను తెచ్చుకుంటే ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ స్టార్ అయ్యాడు. నేడు హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ చెర్రీకి క్యూ కడుతున్నాయి. ఈ విషయమే ఇపుడు అల్లు అరవింద్ కి నచ్చడం లేదంటూ ఇమంది రామ రావు అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ కంటే మంచి ఇమేజ్ రామ్ చరణ్ తెచ్చుకోవడం అరవింద్ జీర్ణించుకోలేకపోతున్నారని చెర్రీ మీద కోపంగా ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.