Senior journalist Imandi Ramarao : సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు కూసింత లక్ కూడా ఉండాల్సిందే. ఎంత టాలెంట్ ఉన్నా లక్ లేకపోయినా కొంతమంది కనుమరుగై పోతారు. అలాంటి వాళ్లలో తరుణ్, రోహిత్, శివ బాలాజీ వంటివారు ఎందరో. టాలెంట్ తో మంచి స్టార్ డమ్ అలాగే ఆఫర్స్ తెచ్చుకున్నా లక్ లేకపోవడం కొన్ని ఫ్లాప్స్ రావడంతో కెరీర్ నే పోగొట్టుకున్నారు వీళ్ళు. ఇక కెరీర్ ను నిలబెట్టుకోవాలనే తపన కూడా వీళ్ళలో లేకపోవడం వల్లే వాళ్ళ కెరీర్ నాశనం అయిందంటూ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడారు.

తరుణ్, రోహిత్ కెరీర్ పోడానికి కారణం ఏంటంటే…
హీరో తరుణ్ గురించి ఇమంది రామారావు గారు మాట్లాడుతూ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏకంగా జాతీయ అవార్డు అందుకున్న తరుణ్ ఆపైన హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. నువ్వే కావాలి నుండి నువ్వే నువ్వే వరకు హిట్లు అందుకుని స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అయితే కెరీర్ లో ఫ్లాప్స్ వచ్చినపుడు స్లో అయినా మళ్ళీ కష్టపడి సక్సెస్ కొట్టాలి.

కానీ తరుణ్ ఫ్లాప్స్ రావడంతో ఇక సినిమాలను వదిలి వ్యాపారాలను చూసుకుంటూ బిజీ అయ్యాడు. అలా తన సినీ కెరీర్ కు తానే విలన్ అయ్యాడు అంటూ మాట్లాడారు. ఇక సిక్స్ టీన్స్ సినిమా హీరో రోహిత్ కూడా ఒక్కసారిగా లైంలైట్ లోకి వచ్చి సక్సెస్ చూసాడు. ఆపైన వరుస అవకాశాలను అందుకున్నా మధ్యలో ఫ్లాప్స్ రావడంతో ఇండస్ట్రీలో లేకుండా పోయాడు. అవకాశాలు లేనపుడు వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానైనా చేస్తూ ఇండస్ట్రీలో ఉండుంటే కెరీర్ బాగుండేది కానీ అలా చేయలేదు. అలా వీళ్ళు వాళ్ళ సినీ కెరీర్ కు వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టేసారు అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు.