Senior Journalist Imandi Ramarao : బోల్తా కొట్టిన భోళా శంకర్…ఆస్తులమ్ముకున్న నిర్మాత…. ప్లాప్ కి కారణం ఆయనే…: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

0
40

Senior Journalist Imandi Ramarao : చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కీర్తి సురేష్ చెల్లిగా హీరోయిన్ గా తమన్నా నటించిన ఈ సినిమాకు చాలా రోజుల తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ సినిమా వేదాళం కి రీమేక్ కాగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే తెలుగులో సినిమాలో కొన్ని మార్పులను చేసి తీసిన చిరు అభిమానులకు సినిమా నచ్చలేదు. ఇక ఈ సినిమా ప్లాప్ అవడానికి గల కారణాలను సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామరావు మాట్లాడారు.

సినిమా పొవడానికి కారణం అదే…

ఇమంది గారు సినిమా పొవడానికి గల కారణాలను గురించి మాట్లాడుతూ సినిమా మీద మొదటి నుండి వైసీపీ వాళ్ళు కావాలనే నెగెటివ్ ప్రచారం చేసారంటు చెప్పారు. సినిమా చూసాక యావరేజ్ గా అయితే ఆడుతుందని భావించిన బయటికి అందరూ సినిమా బాగోలేదని ప్రచారం చేయడం వల్ల చాలా మంది సినిమా చూడక ముందే సినిమా బాగోలేదని అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి నెగెటివ్ ప్రచారం వల్లే సినిమా కలెక్షన్స్ దెబ్బతిన్నాయని ఇమంది రామారావు తెలిపారు. ఇక తాజాగా భోళా శంకర్ సినిమా నిర్మాత నష్టాలను పుడ్చడానికి ఆస్తులను అమ్ముకుంటున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మరోసారి చిరు సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయినట్లయింది.