Senior Journalist Imandi Ramarao : మంచు ఫ్యామిలీ మీద ట్రోల్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైన మాట అందరికీ తెలిసిందే. ప్రతి సారి ఏదో ఒక ప్రెస్ మీట్ లో వీళ్ళు మాట్లాడినదానికి ట్రోలర్స్, మీమర్స్ ఇంకా కొంచెం మసాలా జోడించి సోషల్ మీడియాలో పెడుతూ ఆ ఫ్యామిలీ మీద బురద జల్లుతూ ఉంటారు. ఈ ఇష్యూ మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో మరింత ఎక్కువైంది. ఇక వీటి మీద కేసులు వేసి విచారణ లో ఒక ప్రముఖ హీరో ప్రమేయం ఉంది, అతని ఆఫీస్ నుండే ఈ ట్రోల్ల్స్ జరుగుతున్నాయి అంటూ మంచు ఫ్యామిలీ చెప్పడం త్వరలో బయటపెడతాము అంటూ ప్రకటించడం వల్ల మరోసారి చర్చ మొదలైంది. ఇక ఈ విషయాలను విశేలషిస్తూ అసలు మంచు ఫ్యామిలీ టార్గెట్ చిరంజీవి నా లేక ప్రకాష్ రాజా అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు ఇమంది రామారావు గారు.

టార్గెట్ ఎవరు… ఇప్పుడెందుకు తెర మీదికి మళ్ళీ ట్రోల్ల్స్ వివాదం…
ఇమంది రామారావు గారు మాట్లాడుతూ అసలు ట్రోల్స్ కి ఉప్పందించేది మంచు ఫ్యామిలీనే. వాళ్ళ మాటలే ట్రోల్ కి కారణం. మా నాన్నను మించిన నటుడు దేశంలో లేడు అంటూ మాట్లాడితే నవ్వకుండా ఉంటారా ఎవరైనా. ఇక మంచు విష్ణు నాకు మంచి సినిమాలు పడుంటే దేశంలో నెంబర్ వన్ స్టార్ హీరో అయ్యుండేవాడిని అంటూ మాట్లాడుతారు ఇవన్నీ విని జనాలు నవ్వుకోరా.. ‘కందుకూరి భకాహం పంతులు’ అంటూ మాట్లాడితే నవ్వకుండా ఉంటారా.

ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎవరో చేయించుంటారు అనడం తప్పు. మా ఎన్నికల సమయంలో మా మీద ట్రోల్స్ ఎక్కువయ్యాయి అంటే ప్రకాష్ రాజ్ చేయించారా లేక ఆయనను సపోర్ట్ చేసిన చిరంజీవి చేశారా, ఎవరు చేసినట్లు, అయినా ఎందుకు చేస్తారు. ఒకవేళ ఆధారాలు ఉంటే ఇప్పటికే చెప్పాలి కదా అలా కాకుండా చెప్తాము అపుడు చెప్తాము ఇప్పుడు చెప్తాము అంటూ కాలయాపన ఎందుకు అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు.




























