Featured

Senior Journalist Srinivas Reddy : ఆ భయంతోనే బీజేపీ తో పొత్తుకు జగన్ ప్రయత్నాలు..!! మోడీ చూపు ఎవరి వైపు?? జరగబోయేది ఇదే..: సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి

Senior Journalist Srinivas Reddy : ఏపీ రాజకీయాల్లో అప్పుడే ఎలక్షన్ హడావిడి, అలానే పొత్తులు, వ్యూహలకు పదును పెడుతున్నాయి అన్ని ప్రధాన పార్టీలు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, కొత్త పార్టీ అయిన జనసేన అన్నింటి చూపు ఏ మాత్రం ఏపీలో క్యాడర్ లేని బీజేపీ వైపు చూస్తున్నాయి. బీజేపీతో పొత్తు కొసం తహతహలాడుతున్నాయి. ఒకవైపు సీఎం జగన్ మరోవైపు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ రెండూ బీజేపీతో పోతుకు ఎగబడుతున్న పరిస్థితి. అయితే అసలు బీజేపీ ఎవరి వైపు చూస్తోందో. ఒకవైపు జగన్ తో సన్నిహితంగా ఉంటూనే మరో వైపు జనసేన తో పొత్తులో ఉంది. అయితే జనసేన టీడీపీతో పొత్తు బంధం కోరుకుంటోంది. దేంతో ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ మళ్ళీ ఒక్కటవుతాయా లేక జగన్ తో బీజేపీ దోస్తీ చేస్తుందా అనే చర్చలు ఎక్కువయ్యాయి. ఇక ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి ఆయన విశ్లేషణ ఇచ్చారు.

మోడీ చూపు ఎవరి వైపు…

మోడీ, అమిత్ షా ఈసారి తమ చూపు సౌత్ రాష్ట్రాల మీద గట్టిగానే నిలిపాయి. ఏమాత్రం క్యాడర్ కూడా లేనిచోట్ల అధికారంలోకి రావాలని కలలు కంటున్నాయి. ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ ఏపీ, తెలంగాణలలో బలపడాలని ప్రయత్నస్తోంది, అయితే తెలంగాణ లో కొంతవరకు సక్సెస్ అయినా ఏపీలో ఇంకా ఆ ఛాన్స్ రాలేదు. అయితే ఏ మాత్రం క్యాడర్ లేని బీజేపీతో పొత్తు కోసం ఏపిలోని పార్టీలన్నీ పోటీపడుతున్నాయి అంటూ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ తో బంధం కోసం రాష్ట్రంలోని పార్టీలు ఆరాటపడుతున్నాయని చెప్పారు. జగన్ బీజేపీ తో స్నేహాన్ని వదులుకోడానికి సిద్ధంగా లేడని, ఆశ్చర్యంగా అన్ని ప్రధాన పార్టీలకు బీజేపీ తో వ్యతిరేకత లేదంటూ చెప్పారు.

ఒకవైపు టీడీపీ తో బీజేపీ కి తెలంగాణలో అవసరం ఉంది అందుకే టీడీపీతో పొత్తు కోసం ఆలోచిస్తున్నారు. ఇక జనసేన ముందు నుండి బీజేపీ తో బంధం కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు జగన్ లాంటి మిత్రుడిని వదులుకొని టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లడమా, లేక జగన్ తోనే వెళ్లడమా అనే మీమాంస లో బీజేపీ ఉంది. తెలంగాణలోనూ కెసిఆర్ తో లోపాయకారి బంధంలో ఉన్న బీజేపీ కి అక్కడ టీడీపీ క్యాడర్ ఇంకా బలంగా ఉండడం వల్ల ఇప్పుడు టీడీపీ అవసరం పడింది. అయితే బీజేపీ చూపు ఎవరివైపు ఉంటుందో, ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే సమీకరణలు ఎలా మారతాయో వేచి చూడాలి అంటూ శ్రీనివాసరావు రెడ్డి అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

2 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

2 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

3 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

4 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

5 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

5 hours ago