Senior NTR: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన హీరోగా నటించిన ఎన్నో సినిమాలలో నెగటివ్ పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

కెరియర్ మొదట్లో హీరోగా ఇండస్ట్రీలో రాణించాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఒకవైపు తనకు హీరో అవకాశాలు వస్తున్నప్పటికీ మరోవైపు నెగిటివ్ పాత్రలు చేస్తూ తన కెరీర్లో పెద్ద సాహసమే చేశారు.
సాధారణంగా ఏ హీరో అయినా తనకు హీరో అవకాశాలు వస్తే నెగిటివ్ పాత్రలు చేయడానికి ఇష్టపడరు కానీ ఎన్టీఆర్ వైవిధ్యమైన పాత్రలలో నటించాలనే ఉద్దేశంతో ఇలా నెగిటివ్ పాత్రలో కూడా నటించారు.

ఇలా నెగటివ్ పాత్రలు మాత్రమే కాకుండా రఘురామయ్య హీరోగా నటించిన మాయా రంభ సినిమాలో నలకూబరుడిగా ఎన్టీఆర్ విలన్‌గా నటించారు. ఇక రాజు పేద సినిమాలో ఎన్టీఆర్ పూర్తిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించారు.
చింపిరి జుట్టు, చినిగిపోయిన దుస్తులలో ఎన్టీఆర్…
ఇలా ఒక హీరో ఈ విధమైనటువంటి డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించడానికి ఎవరూ ఒప్పుకోరు. కానీ ఎన్టీఆర్ మాత్రం అప్పట్లో ఇలాంటి డీ గ్లామర్ పాత్రలో ఫేస్‌కు నలుపు రంగుతో పాటు చింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్టలు ధరించి ఎన్టీఆర్ నటించారు. ఇలా కెరియర్ మొదట్లోనే ఎన్టీఆర్ పెద్ద సాహసం చేసి ఇలాంటి పాత్రల్లో నటించారని చెప్పాలి. కెరీర్ మొదట్లో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఎన్టీఆర్ కూడా ఎన్నో విభిన్న పాత్రలలో నటించారు. ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్
మల్లీశ్వరి – పాతాలభైరవి సినిమాల్లో హీరోగా నటించి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.




























