Senior NTR : అప్పట్లో హీరో హీరోయిన్లు అంటే సమానం అనే రేంజ్లో హీరోయిన్ల పాత్రలు సినిమాల్లో ఉండేవి. రెమ్యూనరేషన్ల నుండి, గౌరవం ఇవ్వడం వరకు అన్నింటా హీరోలతో సమంగా హీరోయిన్లకు ప్రతినిధ్యం ఉండేది. ఇక హీరోలు హీరోయిన్ల మధ్య ఇతర ఆర్టిస్టుల మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఉండేవి. ఇక హీరోలు హీరోయిన్లకు చాలా గౌరవం ఇచ్చేవారు. ఇక ఈ విషయంలో అన్నగారు ముందుంటారు. అయన ఇంటికి వెళ్లి చాలా సార్లు భోజనం చేశామని అప్పటి హీరోయిన్లు చాలా మంది చెబుతుంటారు. బసవతారకం గారు చాలా బాగా చూసుకునేవారు అంటూ చెబుతారు.

అమ్మడు అంటూ ఆ హీరోయిన్ ను పీలిచేవారట…
ఇక అన్నగారు ఆయనతో చేసిన హీరోయిన్లకు చాలా మర్యాద ఇచ్చేవారు. అయన అప్పట్లో వాణిశ్రీ గారు మంచి హిట్ పెయిర్ గా నిలిచారు. ఇక వాణిశ్రీ గారంటే అన్నగారికి అభిమానం అందుకే ఆమెను అమ్మడు అని పిలిచేవారట. ఇక ఆయన సినిమా అప్పుడు వాణిశ్రీ గారిని పిలిచి కొబ్బరికాయ కొట్టించి పట్టు చీరలు పెట్టి సారె ఇచ్చి పంపేవారట. ఇక హీరోయిన్లలో సావిత్రి, జమున, అంజలి దేవి, భానుమతి వంటి వారితో కూడా మంచి సంబందాలు కలిగిన ఎన్టీఆర్ గారు తరచూ ఇంటికి భోజనానికి ఆహ్వానించేవారట. ఇక ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందంటే ఖచ్చితంగా అందరినీ ఇంటికి వెళ్లి మరీ పిలిచి వచ్చేవారట.

ఇంటికి వచ్చిన వారికి పట్టు చీరలు పెట్టి సారె పెట్టి పంపేవారట అన్నగారు. సావిత్రి, భానుమతి, అంజలి దేవి వంటి వారు చెన్నై లో సెటిల్ అవ్వడం వల్ల జమున గారితో కొంత ఎక్కువ చనువుగా ఉండేవారట అన్నగారు. జమున గారికి ఇల్లు కట్టుకోమని సలహా ఇచ్చి ఇల్లు కట్టుకునేప్పుడు ప్రభుత్వ అనుమతుల విషయంలో సహాయం చేశారట. ఇలా అప్పటి హీరోలు హీరోయిన్ల మధ్య అనుబంధం చాలా బాగుండేది ఇప్పుడున్న హీరో హీరోయిన్ల మధ్య అలాంటి రాపో ఉండదు. ఏడాదికి ఒక సినిమా చేయడం వల్ల ఒక హీరోయిన్ కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు చేయకపోవడం వల్ల హీరో హీరోయిన్ల మధ్య పెద్ద పరిచయాలు ఉండటం లేదు.































