Senior NTR : తెలుగు సినిమాను సీనియర్ ఎన్టీఆర్ గారు ఎంత ప్రభావితం చేసారో రాజకీయాలను కూడా అంతే ప్రభావితం చేసారు. తెలుగు సినిమాలో రాముడు, కృష్ణుడు వంటి దేవుడు ఆయనే. 90 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని తెలుగుగడ్డ మీద భూస్థాపితం చేసారు. కేవలం తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. అయితే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది. సినిమాలను పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, ఎన్నో అవమానలను చేసినా ప్రజాసేవకు అంకితమైన ఆయన ఎవరి ప్రోద్భలంతో వచ్చారో తెలుసా…

సీల్డ్ కవర్ సీఎంలను చూసి భరించలేక రాజకీయాల్లోకి…
సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి సమాజ సేవకు వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ పాలన లో ఉంది. రోజుకో సీఎం ను పూటకో సీఎం ను ఢిల్లీ లో యంత్రాంగం మారుస్తున్న సమయంలో ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకం గారు ఎన్టీఆర్ గారితో అన్నారట మీరు ప్రజల్లో ఎంతో పేరున్న వ్యక్తి, కొన్ని కోట్లమంది మిమ్మల్ని ఆరాధిస్తున్నారు మీ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలు బాగుపడతారు అని సలహా ఇచ్చారట.

ఇక ఆ మాటతో ఎన్టీఆర్ గారు ఆలోచనలో పడ్డారు, ఇక సర్ధార్ పాపారాయుడు షూటింగ్ లో ఉన్న ఆయనను కొంతమంది సన్నిహితులు మీకు 60 ఏళ్ళు నిండనున్నాయి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అని అడగడం తో నెలలో 15 రోజులు ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను అంటూ చెప్పారు. అలా అన్నగారు 1982 మార్చ్ 28 న తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఇక స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం లోకి వచ్చి ఎన్టీఆర్ సీఎం అయ్యారు. చైతన్య రథం పేరుతో ఊరూరా తిరిగి ప్రచారాన్ని నిర్వహించి ప్రజలకి దగ్గరయ్యారు. అయితే చివరి రోజుల్లో ఎన్నో అవమానాలను భరించి మరణించారు.
































