Senior producer Chittibabu : బాలయ్య అనగానే అన్ స్టోపబుల్ ముందు వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. ఆయన ఇమేజ్ మొత్తం ఆ ఒక్క షోతో మారిపోయింది. ఏంటి బాలయ్య ఇలా ఉంటాడా, ఇంత సరదాగా మాట్లాడుతాడా, ఇంత కామెడీ చేస్తాడా అనేలా ఆకట్టుకున్నాడు. అప్పటివరకు బాలకృష్ణ అంటే కోపంగా ఉంటాడు, దురుసుగా ప్రవర్తిస్తాడు అని అభిప్రాయం ఉండేది అది మొత్తం అన్ స్టోపబుల్ తో పోయింది. ఆయన ఫన్, ఎనర్జీ, పంచ్ లకు అన్ స్టోపబుల్ అనేలా ఉంది షో. మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఒకరకంగా ఆహా కి చందాదారులు పెరగడానికి కారణం అన్ స్టోపాబుల్ షో అని చెప్పాలి. మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఈ షో విజయానికి తెర ముందు బాలయ్య ఎనర్జీ ఎంత కారణమో తెరవెనుక అన్ స్టోపబుల్ టీం కృషి అంతే కారణం. అయితే ఈ షోకి అసలు బాలకృష్ణ ని తీసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది అరవింద్ గారికి అన్న విషయాలను సీనియర్ నిర్మాత చిట్టిబాబు వివరించారు.

బాలయ్య తో అరవింద్ షో ఎలా ప్లాన్ చేసాడు…
చిట్టిబాబు గారు మాట్లాడుతూ బాలయ్య అనగానే కోపష్టి, ఆవేశ పరుడు అంటూ ఒక ఇమేజ్ బయట ఉంది. అయితే ఆయనను దగ్గరగా చూసినవాళ్లకు మాత్రం బాలకృష్ణ అనగానే సరదాగా ఉంటూ అందరితో కలిసిపోయే వ్యక్తి అని తెలుస్తుంది. ఇప్పుడు అన్ స్టాపబుల్ ద్వారా బాలయ్య నిజంగా ఎలా ఉంటాడో అందరికీ తెలిసింది. బాలయ్య పనిలో ఒక క్రమశిక్షణ మెయిన్టైన్ చేస్తాడు అందువల్ల కొన్నిసార్లు సీరియస్ గా ఉంటాడు. కానీ జనాల్లో ఎక్కువగా ఆ సీరియస్ గా ఉండటమనేది ప్రొజెక్ట్ అయింది.

కానీ నిజానికి బాలయ్య చిన్నపిల్లాడిలా చాలా సరదాగా ఉంటాడు. ఈ విషయం అల్లు అరవింద్ కి తెలుసు అందుకే బాలయ్యకి అనుగుణంగానే ఈ షో డిజైన్ చేసాడు. ఈ షోతో బాలయ్య లోని ఈ కోణం అందరికీ తెలిసింది. అల్లు రామలింగయ్య గారికి ఎన్టీఆర్ గారికి చక్కటి అనుబంధం ఉంది. ఇంటికి వచ్చి అల్లు రామలింగయ్య గారు ఎన్టీఆర్ సతీమణి బసవతారకం గారి దగ్గర అడిగి వంటలు చేయించుకునేవారు. అప్పట్లో ఆ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది అంటూ చిట్టిబాబు అభిప్రాయపడ్డారు.



























