Senior villain Devraj : ఎర్ర మందారం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా మంచి పేరు తెచ్చుకుని దాదాపు అందరు అగ్ర హీరోలా సినిమాల్లోనూ విలన్ గా నటించిన కన్నడ నటుడు దేవ్ రాజ్ గారు. ఆయన మొదట విలన్ గా చేసినా ఆపైన కన్నడ సినిమాల్లో హీరోగా చాలా సినిమాల్లో చేసారు. ఒకవైపు విలన్ గా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మరో వైపు హీరో గాను మంచి హిట్స్ అందుకున్నారు. ఎపుడూ తెలుగు మీడియాకు పెద్దగా కనిపించని దేవ్ రాజ్ గారు లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో పాల్గొని అయన కుటుంబం అలాగే కెరీర్ గురించి మాట్లాడారు.

చిరంజీవి గారు నేనేం తప్పు చేశా అని అడిగారు…
చిరంజీవి, దేవ్ రాజ్ ల కాంబినేషన్ లో మంచి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక చిరంజీవి గారు ఇప్పటికీ ఏదైనా షూటింగ్ లొకేషన్లో కనిపించి పలకరిస్తే బాగా మాట్లాడుతారని చాలా మర్యాద ఇస్తారంటూ దేవ్ రాజ్ చెప్పారు. ఇక ఎస్పి పరుశురాం సినిమా షూటింగ్ టైములో జరిగిన సంఘటన గురించి వివరించారు. అప్పట్లో పలు భాషా సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల బాగా ఇబ్బందులు వచ్చేవి. ఎస్పీ పరుశురాం షూటింగ్ అపుడు ఒక రోజు ఆలస్యం అవడంతో మరో కన్నడ సినిమా షూటింగ్ కి ఆలస్యంగా సాయంత్రం వస్తానని చెప్పాల్సి వచ్చింది. ఆ సమయంలో యాక్షన్ సీన్ ముగించుకుని రక్తం మరకలను క్లీన్ చేసుకుని ట్రైన్ బాత్ రూమ్ లోనే స్నానం చేయాల్సిన వచ్చింది. అది ఫారెస్ట్ ఏరియా అవడం వల్ల అలా అందరం సర్దుకున్నాం, ఇక స్నానం చేసి బ్యాగ్ సర్దుకుని వెళ్లే లోపు చిరంజీవి గారు నాకోసం ఎదురుచూస్తున్నారు.

భోజనము ఏర్పాట్లు చేసి నాకోసం చూస్తున్నారు. లేట్ అవుతుంది అని చెబితే నేను పంపిస్తా మీ షూటింగ్ ఆలస్యమవకుండా చూసుకుంటా భోజనము చేయండని చెప్పి తిన్నాక స్టేషన్ తీసుకెళ్లి అక్కడ మేనేజర్ ను పంపి ట్రైన్ ఎక్కాక మళ్ళీ బెంగళూరు రీచ్ అయ్యే దాకా ఫాలో అప్ చేసారు. ఇక తెలుగు సినిమాలను బాగా తగ్గించిన సమయంలో ‘అన్న’ సినిమా 100 డేస్ ఫంక్షన్స్ లో ముఖ్య అతిధిగా వచ్చిన చిరంజీవి గారు పక్కకు పిలిచి ఏదైనా తప్పు జరిగిందా ఎందుకు మీరు తెలుగులో నటించడం లేదు. నేను పదే పదే ఆఫర్స్ పంపుతున్నా చేయడం లేదని అడిగారు. అంత పెద్ద హీరో నన్ను అడగాల్సిన పని లేదు కానీ అడిగారు అంటూ చిరంజీవి గొప్పతనం వివరించారు.
































