Senior villain Ponnambalam : విలన్ గా, స్టంట్ మాస్టర్ గా వందల సినిమాల్లో నటించిన నటుడు పొన్నాంబలం. తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన పొన్నాంబలం తెలుగులో ఘరానా మొగుడు, హిట్లర్, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, చూసొద్దాం రండి, నువ్వొస్తావని వంటి సినిమాల్లో విలన్ గా నటించారు. ఎన్నో సినిమాల్లో నటిస్తూనే అటు రాజకీయాల్లోను క్రియాశీలకంగా ఉన్న పొన్నాంబలం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చిన్న గదిలో ఉండేవారు. అయితే తాజాగా ఆరోగ్యం కొంత మెరుగవడంతో సినిమాల్లో తిరిగి నటిస్తున్న ఆయన తన ఆహారపు అలవాట్ల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

సంపాదించిన డబ్బులన్నీ ఆహారానికే…
పొన్నాంబలం విలన్ గా బాగా పీక్స్ కి ఉన్నపుడు ఒక సినిమా కోసం లక్ష దాకా తీసుకునేవారు. ఘారానా మొగుడు సినిమా టైంకి పొన్నాంబలం క్రేజ్ బాగా పెరిగి హై రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాంటి సమయాల్లో బాగా ఆస్తులు కూడబెట్టిన పోన్నాంబలం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దెబ్బ తిని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే అప్పట్లో తన ఆహారానికి సంపాదించిన దాంట్లో 60 శాతం డబ్బులు అయిపోయేవి అంటూ తన ఆహారపు అలవాట్లు చెప్పి షాక్ ఇచ్చారు. విదేశాలకు వెళ్ళినపుడు కప్పలను, పాములను, గబ్బిలాలు, జింకలను, అలాగే కింగ్ క్రాబ్స్ ను తినేవాడిని అంటూ చెప్పారు.

ఒకసారి ఒక యాభై కప్పలను, పాములను కూడా చాలా వాటిని తినేవాడినని చెప్పారు. కప్పలు తింటే గుండె కు మంచివని చెప్పారు. ఇక జింకలను తింటే రక్తానికి మంచిది అంటూ చెప్పారు. ఇక తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలలో దొరికే గబ్బిలాలు ఒక్కొక్కటి నాలుగైదు కేజీలు ఉంటాయని, వాటిని తింటే అస్తమా కి చాలా మంచిదని చెప్పారు. ఇక విదేశాలకు వెళ్ళినపుడు ఇటువంటి ఆహారం తీసుకునేవాడినని, ఎక్కువ కసరత్తులు, బరువులు ఎత్తడం వంటివాటి కంటే కూడా భుజాలకు సంబంధించిన కసరత్తులు ఎక్కువగా చేస్తానని చెప్పారు పాన్నాంబలం.