Serial Actress Asmitha : ఈటీవీ లో వచ్చిన పద్మవ్యూహం సీరియల్ ద్వారా నటిగా మారిన ఆశ్మిత సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లోను కనిపించింది. అయితే ఎక్కువగా సీరియల్స్ తో గుర్తింపు పొందిన అస్మిత మా టీవిలో ప్రసారమయ్యే అగ్నిసాక్షి సీరియల్ ద్వారా విలన్ గా కూడా బాగా నటించి ప్రేక్షకులకు ఇంకా దగ్గరైంది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా యూత్ కి బ్యూటీ టిప్స్ చెబుతూ మంచి ఫాలోయింగ్ తో ఉన్న అస్మిత పెళ్లి తరువాత యాక్టింగ్ కు దూరంగా ఉంది. నటన కు దూరం అవ్వాలని అనుకుంటున్నట్లు దానికి గల కారణాలను ఇటీవల ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు.

హీరోయిన్ గా చాలా అవకాశాలు వచ్చిన చేయకపోడానికి కారణం….
అస్మిత రాజస్థాని కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నతనం నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్లో వాళ్ళు మాత్రం యాక్టింగ్ కెరీర్ వద్దని చెప్పేశారట. కానీ చదువుయ్యాక ఇండస్ట్రీ కి వెళ్ళడానికి ఇంట్లో వాళ్లకు ఇండస్ట్రీ లో ఉన్నా కుటుంబం పరువు తీయను మంచి పేరు తెచ్చుకుంటా అని వాళ్ళను ఒప్పించి ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అస్మిత మురారీ సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. ఇక ఆ సినిమా తరువాత వరుసగా హీరోయిన్ అవకాశాలు చాలానే వచ్చిన వాటన్నింటిని వద్దనుకుని కేవలం ఫ్రెండ్ క్యారెక్టర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుందట.

దీనికి కారణం ఇంట్లో వాళ్లకు మాటివ్వడం వల్ల హీరోయిన్ క్యారెక్టర్ అయితే కష్టం అని హీరోయిన్ ఫ్రెండ్ అలా అయితే ఇబ్బంది ఉండదు అని అలోచించి ఆ నిర్ణయం తీసుకుంది. పైగా మంచి పాత్రలు చేయాలి ఇలాంటి ఏమి ఆలోచన లేకపోవడం వల్ల మొదట్లో వచ్చిన చిన్న అవకాశం అయిన చేసిందట అస్మిత. ఇక ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ తో బాగా ఫాలోయింగ్ ను సంపాదించిన అస్మిత నటనకు గుడ్ బై చెప్పేసింది.


































