Serial actress Jyothi Rai : యువ డైరెక్టర్ తో పీకల్లోతుల్లో ప్రేమలో మునిగి తేలుతున్న గుప్పెడంత మనసు సీరియల్ జగతి…!

0
266

Serial actress Jyothi Rai : బుల్లితెర మీద మా టీవిలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియల్ లో రిషి, వసుధర లవ్ స్టోరీ ఎంత బాగా ప్రేక్షకులను ఆకట్టుకుందో. రిషి తల్లిగా మహేంద్ర భార్యగా జగతి పాత్ర అందరికీ నచ్చింది. ఎంతో హుందగా నడిచే ఈ పాత్ర జ్యోతి రాయ్ అనే కన్నడ నటి నటిస్తోంది. ఈ సీరియల్ కంటే ముందు కొన్ని సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ కి ఈ సీరియల్ తో మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. అలాంటి జ్యోతి రాయ్ గురించి ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కుర్ర డైరెక్టర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిన జ్యోతి…

కన్నడ నటి జ్యోతి రాయ్ ఇక్కడికంటే సొంత ఇండస్ట్రీలో మరింత ఫేమస్. ఆమె సినిమాల్లో కూడా నటించింది. తాజాగా గాంధద గుడి సిరీస్ లో కూడా కనిపించింది. ఇక పలు వెబ్ సిరీస్ లలోను కనిపించిన జ్యోతి రాయ్ ఒక కుర్ర డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పలు సీరియల్స్‌తో పాటు ‘ప్రెట్టీ గర్ల్’ అనే క్రైమ్ థిల్లర్ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోన్న ఈ బ్యూటీ ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకు పూర్వజ్‌ అనేయంగ్ డైరెక్టర్ తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఓటీటీ వేదికగా అలరిస్తున్నాయి.

ప్రస్తుతం సుకు పూర్వజ్‌ దర్శకత్వంలో ‘ఏ మాస్టర్ పీస్’ అనే మరో సినిమా రాబోతోంది. అయితే వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ తీసుకున్న ఫోటోలు కూడా జ్యోతి రాయ్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా మరో ఆర్టిస్ట్ సుజాత పెట్టిన కామెంట్‌ వీళ్లు రిలేషన్‌లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. ‘లవ్ లవ్ అండ్ లవ్ యూ బోత్, కీప్ రాకింగ్ ఆల్వేస్’ అంటూ సుజాత వారి ఫొటోకు కామెంట్ పెట్టగా ‘థాంక్యూ డియర్’ అంటూ జ్యోతిరాయ్ కూడా బదులిచ్చింది. దీంతో వీళ్ళ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చినట్లయింది. అయితే జ్యోతి రాయ్ కి ఇరవై ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం జరిగగా అతని ద్వారానే నటి అయిందని వారికి ఒక బాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యంగ్ డైరెక్టర్ తో జ్యోతి ప్రేమాయణం ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ అయింది.