Serial Heroine Maahi Gowthami : తెలుగు సినిమాల్లో హీరోయిన్ అంటే ముంబై నుండి దిగుమతి చేసుకుంటున్నారు మన డైరెక్టర్లు. లేకపోతే మలయాళం నుండో తమిళ్ నుండో కన్నడ నుండో ఇలా పక్క రాష్ట్రంలోని అమ్మాయిలనే హీరోయిన్లుగా ఎంచుకుంటున్నారు కానీ మన తెలుగుమ్మాయిలు కనిపించరు. ఏదో ఒకటి ఆరా చిన్న సినిమాల్లో కనిపించినా పెద్ధగా అవకాశాలు రావు. ఇక బుల్లితెర మీద అయినా తెలుగు అమ్మాయిని చూద్దామా అంటే అక్కడా కన్నడ అమ్మాయిల హావ కనిపిస్తోంది. బుల్లితెర మీద హీరోయిన్లే కాదు హీరోలు కూడా చాలా సీరియల్స్ లో కన్నడ వాళ్ళే కనిపిస్తున్నారు. అయితే ఒక తెలుగు అమ్మాయి మాత్రం రెండు ప్రముఖ ఛానెల్స్ లో ప్రైమ్ టైం సీరియల్స్ లో హీరోయిన్ గా చేస్తూ సత్తా చాటుతోంది. ఆ ముద్దు గుమ్మడు మరెవరో కాదు రంగుల రాట్నం, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్స్ లో హీరోయిన్ గా చేస్తున్న మాహి గౌతమీ.

చాలా కష్టాలు పడ్డాను… పట్టుకుని ఏడ్చేస్తారు…
మాహి గౌతమీ అచ్చ తెలుగు అమ్మాయి. పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్. తెలంగాణ కి చెందిన మాహి గౌతమీ మొదట వనిత ఛానెల్ లో యాంకర్ గాను అలాగే రేడియో జాకిగా ఒక రేడియో ఛానెల్ లోనూ పనిచేసింది. ఇక ఆపైన వీడియో జాకీగా కెరీర్ లో ముందుకు సాగిన మాహి కి సీరియల్స్ అంటే చాలా ఇష్టమట. అలా తాను మొదట సీరియల్స్ లోకి అడుగుపెట్టాలని అనుకోకుండానే అడుగుపెట్టాను అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తాను ఈ స్టేజికి రావడానికి చాలా కష్టపడ్డానని ఎమోషనల్ అయ్యారు.

అయితే ప్రతి సందర్భలోనూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందంటూ తెలిపారు మాహి. ప్రస్తుతం నటిస్తున్న రంగుల రాట్నం అలాగే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్స్ రెండిటిలోనూ తన క్యారెక్టర్ బాగా నచ్చిందని లక్ష్మి గాను, సీతా మహాలక్ష్మి గాను బయట పిలుస్తున్నారని కొంతమంది పెద్ద వారు పట్టుకుని ఏడ్చేస్తారని, ఎన్ని కష్టాలు పడుతున్నావు అంటూ బాధపడతారని, వారికి నచ్చజెప్పి అదంతా సీరియల్ అని నిజం కాదని వివరిస్తుంటాను అంటూ చెప్పారు గౌతమీ.


































