Shaakuntalam: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడం,విజువల్స్ నాసిరకంగా ఉండడంతో ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది . ఇక ఈ సినిమా సమంతకెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమా గురించి సమంత స్పందిస్తూ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు అంటూ భగవద్గీతలోని ఒక కొటేషన్ షేర్ చేసింది. దిల్ రాజు కూడా ఈ సినిమా మీద భారీ నమ్మకంతో నిర్మాతగా వ్యవహరించాడు. అయితే దిల్ రాజు పాతికేళ్ళ సినీ కెరీర్ లో కూడా శాకుంతలం భారీ దెబ్బ తీసినట్లు ఆయనే స్వయంగా వెల్లడించాడు.
ఇక ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు రావటం లేదు. అందువల్ల ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ అప్డేట్ కూడా తెరమీదకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషల ఓటీటీ రిలీజ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ దరకే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా భారీ డిజాస్టర్ కావడంతో పాటు థియేటర్ల నుంచి సినిమాని తప్పించడంతో మే 12 వ తేదీ నుంచి ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నట్లు సమాచారం. అయితే శాకుంతలం ఓటిటి రిలీజ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడ లేదు. అయితే ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…