Shahrukh Khan: బాలీవుడ్ సీనియర్ నటుడు షారుక్ ఖాన్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అయితే అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ మాత్రం తనకు షారుక్ ఖాన్ ఎవరో తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇలా అస్సాం ముఖ్యమంత్రి తనకు షారుక్ ఖాన్ ఎవరో తెలియదంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా అస్సాం ముఖ్యమంత్రి తనకు షారుక్ ఖాన్ ఎవరో తెలియదని చెప్పడానికి కారణం లేకపోలేదు.
షారుక్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ సినిమా జనవరి 25వ తేదీ విడుదల కానుంది. ఈక్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన బేషరం రంగ్ సాంగ్ పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొన్న సంగతి తెలిసింది.ఈ క్రమంలోనే పలువురు సిని రాజకీయ నాయకులు ఈ సినిమా పట్ల తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ నిరసనలు కూడా వెల్లువెత్తాయి. అయితే అస్సాంలో నారేంగి థియేటర్లో కొంతమంది బజరంగ్ దల్ ఈ సినిమా విడుదల చేయడానికి వీలు లేదంటూ నిరసన వ్యక్తం చేయగా మరోవైపు షారుక్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా విడుదల కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు ఓ సమావేశంలో భాగంగా అస్సాం ముఖ్యమంత్రిని ప్రశ్నించగా ఆయన షాకింగ్ సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ… షారుక్ ఖాన్ ఎవరో తనకు తెలియదని కామెంట్ చేశారు. షారుక్ ఖాన్ ఎవరు తన సినిమాలు ఏంటో అనే విషయాలు తనకు ఏ మాత్రం తెలియదంటూ ఈయన తెలియజేశారు.ఈ విషయం గురించి ఇప్పటికే తనకు కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఫోన్ చేశారు. కానీ ఈ షారుక్ ఖాన్ ఎవరో తనకు ఫోన్ చేయలేదని, ఆయన ఫోన్ చేసి విషయం చెబితే అప్పుడు పరిశీలిస్తామని తెలిపారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…