Shaking Sheshu : జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన చాలా మంది జబర్దస్త్ వల్ల గుర్తింపు వచ్చింది అంటూ పాజిటివ్ గా మాట్లాడారు కానీ ఇంతవరకు ఎవరూ జబర్దస్త్ ని విమర్శించలేదు. కానీ మొదటి సారి కిర్రాక్ ఆర్పి జబర్దస్త్ నుండి వెళ్ళిపోయి తీవ్ర విమర్శలు చేసారు. అక్కడ తిండి సరిగా పెట్టరని అలాగే కనీసం మర్యాద కూడా ఇవ్వరు అంటూ మాట్లాడారు. శ్యామ్ ప్రసాద్ గారు అసలు జబర్దస్త్ వాళ్ళను పట్టించుకోరని చెప్పాడు, అందుకే జబర్దస్త్ వీడానని, జబర్దస్త్ వల్ల మాకు లైఫ్ రావడం కాదు జబర్దస్త్ కు మేము లైఫ్ ఇచ్చాము అంటూ మాట్లాడాడు కిర్రాక్ ఆర్పి.

ధనరాజ్ కు వెన్నుపోటు పొడిచాడు…
జబర్దస్త్ గురించి విమర్శలు చేసిన కిర్రాక్ ఆర్పి గురించి విమర్శించారు జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు. జబర్దస్త్ లో తిండి బాగుంటుందని, మరీ తినలేనంతగా ఏం ఉండదని చెప్పాడు. ఇక ఆర్పి మాత్రం తనకు ముందు లైఫ్ ఇచ్చిన వాటిని మర్చిపోవడం అలవాటు. తనకు ముందు టీం లోకి తీసుకుంది రాకింగ్ రాకేష్ అక్కడ ఫేమస్ అయ్యాక ధనరాజ్ టీం లోకి వెళ్ళాడు. కానీ తనకు లైఫ్ ఇచ్చింది అంటే ధనరాజ్ పేరు చెప్తున్నాడు.

అలా తనకు మరచిపోయే అలవాటు ఉంది అంటూ విమర్శించాడు షేకింగ్ శేషు. ఇక కిర్రాక్ ఆర్పి ఆరోపణలు నిజం కాదు మల్లెమాల గురించి వెళ్ళిపోయి అలా మాట్లాడటం మంచిది కాదు అంటూ మాట్లాడారు. ఇంతవరకు ఎటువంటి కాంట్రవర్సీ లేని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు అంటూ అన్నారు.






























