Sharath babu : విలక్షణ నటుడు విలన్ గాను,హీరోగాను, తండ్రి గాను సహాయక పాత్రల్లో ఇలా ఏ పాత్రయినా అందులో ఒదిగిపోయి నటించే ఆర్టిస్ట్ అప్పట్లో శరత్ బాబు గారు. రామ రాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. ఆముదాల వలస లో జన్మించిన ఆయన చెన్నై కి సినిమాల కోసం వచ్చారు. అలా రామ రాజ్యం, కన్నె మనసులు, పంతులమ్మ, సీతకొక చిలుక,చిలకమ్మ చెప్పింది వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన 1981,88,89 మూడు సార్లు ఉత్తమం సహాయక నటుడుగా నంది పురస్కారం సైతం అందుకున్నారు.

శరత్ బాబు ఆరోగ్యం ఆందోళన కరం…..
సినిమాల్లోకి వచ్చాక శరత్ బాబు తనకంటే నాలుగేళ్లు పెద్ధ అయినా సీనియర్ ఆర్టిస్ట్ రమప్రభ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారు పదనాలుగేళ్ల తరువాత విడాకులతో వేరేయ్యారు. శరత్ బాబు గారు తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ ఇలా పలు ఇతర భాషలలోను నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను తండ్రి పాత్రలలోనూ ఒదిగిపోయారు. ఇక కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

అయితే తాజాగా ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం మరింత క్షిణించడంతో చెన్నై నుండి హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ చెప్పలేమని ఇంకా వేచి ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇంకా శరత్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. ఏమైనా ఆయన మళ్ళీ కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని అందరూ కాంక్షిస్తున్నారు.



























