Shekhar Master : బ్యాక్ గ్రౌండ్ డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలు పెట్టి కొన్ని సంవత్సరాలు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా, అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా పనిచేసి ప్రస్తుతం కోరియోగ్రాఫర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నాడు శేఖర్ మాస్టర్. అటు సినిమాల్లో డాన్స్ కంపోజ్ చేస్తూ హిట్స్ ఇస్తూనే మరోవైపు బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఈటీవీ లో వస్తోన్న ఢీ డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్ మాస్టర్. ఆ షోలో మొదలు పెట్టి జడ్జి గా కొనసాగుతూ అప్పుడప్పుడు జబర్దస్త్ వంటి షోలలో కూడా జడ్జిగా వ్యవహారిస్తూ ఉండేవాడు. ప్రస్తుతం ఈటీవీ నుండి వెళ్ళిపోయి మా టీవీ లో కామెడి స్టార్స్ కామెడీ షోలో నాగబాబు తో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. తన డాన్స్ కంపోజిషన్ కి సినిమాల్లో ఎన్నో అవార్డులు అందుకున్న శేఖర్ మాస్టర్ తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.

రాకేష్ మాస్టర్ గొప్ప డాన్స్ మాస్టర్…
సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో డాన్స్ ప్రాక్టీస్ చేయడం కోసం రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్లి అలా ఆయన దగ్గరే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. నిజానికి నా స్నేహితుడిని చేర్పించడానికి వెళ్లి అలా నేను వెళ్లి అక్కడే చేరాను. ఇక మూడేళ్ళ వరకు ఆయనతో డాన్స్ నేర్చుకున్నాను. అప్పట్లో ఆయన డాన్స్ చాలా కొత్తగా ఉండేది. మాస్టర్ స్టైల్ డిఫరెంట్ గా ఉండేది అంటూ చెప్పారు.

అయితే మాస్టర్ కూడా అప్పటికి సినిమా ఫీల్డ్ తో పెద్దగా ఉండేవారు కాదు, తిరుపతి నుండి వచ్చి డాన్స్ స్కూల్ పెట్టుకున్నారు. ఇక మేము జాయిన్ అయిన మూడేళ్లకు ఆయనకు వేణు గారి సినిమా చిరునవ్వుతో లో అవకాశం రావడంతో ఆయన బిజీ అయ్యారు. ఇక నేను గ్రూప్ డాన్సర్స్ గా కొంతకాలం లారెన్స్ గారు సుచిత్ర గారితో పనిచేసి ఆ పైన ఢీ షోకి వచ్చాను అంటూ చెప్పారు శేఖర్ మాస్టర్.