Shekhar Master : టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ లలో ఒకరిగా సాగుతూ.. ఎంతో మంది టాప్ హీరోల చేత స్టెప్పులు వేయించారు శేఖర్ మాస్టర్. సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెర మీద కూడా కొన్ని ప్రోగ్రాములకు న్యాయ నిర్ణేనేతగా చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈయనకు బుల్లితెర మీద కూడా అభిమానులు ఎక్కువే. శేఖర్ మాస్టర్ పిల్లలు కూడా ప్రేక్షకులకు బాగా తెలుసు. సాహితి, విన్నీ లు ఇద్దరూ కూడా డాన్స్ తో ఇరగదిస్తారు. అయితే ఇపుడు శేఖర్ మాస్టర్ కూతురు సాహితి గురించిన ఒక విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

శేఖర్ మాస్టర్, సాహితీలకి కథ చెప్పిన ఒక కొత్త దర్శకుడు…
శేఖర్ మాస్టర్ కుమార్తె తండ్రి పేరుతోనె అందరికీ పరిచయం అయినా కూడా తన డాన్స్ తో టిక్ టాక్ వీడియోలతో సాహితి కూడా మంచి పేరు సంపాదించింది. అంతేకాదు సాహితికి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. అయితే సాహితి హీరోయిన్ గా రావడానికి అంతా రెడీ అయిపోయినట్లే అని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఒక కొత్త దర్శకుడు శేఖర్ మాస్టర్, సాహితీ లకు ఇప్పటికే కథ చెప్పారని, అది నచ్చడంతో శేఖర్ మాస్టర్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

శేఖర్ మాస్టర్ తన పలుకుబడిని ఉపయోగించి టాలీవుడ్లో మీడియం రేంజ్ హీరోలకు దర్శకుడితో కథ చెప్పిస్తున్నారట. అయితే సాహితి, విన్నీ ఇప్పటికే ఒక యూట్యూబ్ ఛానల్ తో పాపులరిటీ తెచ్చుకున్నారు. సోషల్ మీడియా లో సాహితీ పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం కూడా జరిగింది. అప్పట్లో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని శేఖర్ మాస్టర్ సూచించడం జరిగింది. మరి సాహితి హీరోయిన్ గా ఎపుడు వస్తుందో యే హీరోతో చేస్తిందో చూడాలి.



























