Shilpa Ravi: అల్లు అర్జున్ స్నేహితుడు వైకాపా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ సంధ్య థియేటర్లో పుష్ప సినిమా చూశారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి శిల్ప కుటుంబ సభ్యులకు కూడా ఈ సినిమాని వీక్షించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శిల్ప రవి అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఎంతో మంచి స్నేహితులనే విషయం మనకు తెలిసిందే.ఇక ఈయనకు మద్దతుగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లడంతో ఈ ఘటనపై ఎన్నో విమర్శలు వచ్చాయి అలాగే మెగా అభిమానులు కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ పూర్తిగా దూరం పెడుతూ వచ్చారు కానీ అల్లు అర్జున్ మాత్రం స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి.
ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు కూడా శిల్పా రవి అల్లు అర్జున్ కు ఆల్ ద బెస్ట్ తెలియజేసారు అయితే తాజాగా సినిమా విడుదల కాగా అల్లు అర్జున్ తో పాటు ఈయన కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసారా ఇక సినిమా చూసిన అనంతరం చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తారని తెలిపారు.

Shilpa Ravi: జాతర సీన్ సూపర్…
ఇక ఈ సినిమాలో నాకు జాతర సీన్ అద్భుతంగా నచ్చిందని, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని తెలిపారు. అంతేకాకుండా కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ ఈయన కలెక్షన్ల విషయంలో ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.



























