Shoaib Akthar : టీం ఇండియా సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో చావుదెబ్బలు తిని బయటికి వచ్చింది. ఇక మ్యాచ్ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే చెత్త ప్రదర్శన వల్ల అందరి నుండి విమర్శలను ఎదుర్కొంటోంది. కాగా తరచూ ఏవో ఒక కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఉండే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ టీం ఇండియా మీద కామెంట్స్ చేసాడు. చెత్తగా ఆడారు అంటూ విమర్శించేసాడు. దొరక్క దొరక్క అవకాశం దొరికింది కదా అని ఇండియన్ టీంలో లోపాలు ఉన్నాయి, మంచి పేసర్ లేడు అంటూ హాట్ కామెంట్స్ చేసాడు.

మీ ప్రదర్శన చెండాలంగా ఉంది… మీతో ఫైనల్ ఆడాలనుకుంటే…
భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ లో 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్లు కేవలం ఇద్దరే పదహారు ఓవర్లలో వీరబాదుడు బాది అయిపోగొట్టారు. వారి దూకుడికి కళ్లెం వేయలేక పోయారు భారత బౌలర్లు. ఇంగ్లాండ్ ఓపెనర్లైన బట్లర్, అలెక్స్ కలిసి గేమ్ ముగించేసారు. నిజానికి ఇండియన్ టీంలో చాలా లోపలున్నా బాగానే ఆడి విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచారు. అయితే ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. షోయబ్ ట్విటర్ ద్వారా ఇండియా ఆటతీరులోని లోపాలను కామెంట్స్ చేసాడు.

Embarrassing loss for India. Bowling badly exposed. No meet up in Melbourne unfortunately. pic.twitter.com/HG6ubq1Oi4
— Shoaib Akhtar (@shoaib100mph) November 10, 2022
భారత్ చాలా చెత్తగా ఆడింది, చెండాలంగా ఓడింది. బౌలింగ్‌లో ఏ మాత్రం పస లేదు. అసలు చాహల్‌ను ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు, ఇండియన్ టీం సెలెక్షన్ సరిగా లేదు. ఆస్ట్రేలియా అంటేనే పేస్ బౌలింగ్‌కు పెట్టింది పేరు అలాంటిది జట్టులో ఒక్క మంచి పేసర్ లేడు. పిచ్ అనుకూలిస్తే తప్ప టీం లోని బౌలర్లు వికెట్లు తీయలేరు, అసలు వికెట్లు తీద్దామనే ఉద్దేశమే వారిలో కనిపించలేదు. వికెట్లు పడకుండా ఇంగ్లండ్ బ్యాటర్లు ఫ్రీగా ఆడుతుంటే, కనీసం బౌన్సర్లు వేయడమో.. వారిని ఏదో ఒకటి అని డిస్టబ్ చేయడమో ఏమీ చేయలేదు. ఇంగ్లాండ్ ఐదు ఓవర్లు ఆడగానే భారత్ చేతులెత్తేసింది, మీతో కలిసి ఐసీసీ ఫైనల్స్ ఆడాలనుకుంటే ఇలా చేసారు అంటూ వీడియో పోస్ట్ పెట్టాడు.



























