Shobhitha Dhulipala : గూడాచారి సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి శోభిత మళ్ళీ తెలుగులో అడవిశేష్ తో కలిసి నటించిన మేజర్ సినిమాతో కనిపించింది. కానీ ఈ సినిమాలతో అయినా అంత పబ్లిసిటీ వచ్చిందో లేదో కాని నాగచైతన్య తో డేటింగ్ రూమర్స్ తో బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాగ చైతన్య, సమంత విడిపోయాక చైతు తో డేటింగ్ అంటూ, పెళ్లంటూ రూమర్స్ వచ్చాయి.

అయితే వాటిని జనాలు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు కానీ ఎందుకో శోభిత ధూళిపాళ్ళ, చైతూ విషయంలో మాత్రం ఇష్యూ కొంచెం సీరియస్ గా వెళ్ళింది. నిజంగా డేటింగ్ లో ఉన్నారేమో అనుకున్నారు అందరూ. ఇది నిజమై వాళ్లిదరూ పెళ్లి చేసుకుంటే పర్వాలేదు కానీ ఒకవేళ ఇది ఒట్టి రూమరే అయితే ఈ విషయంలో నాగచైతన్య కి జరిగే డామేజ్ కన్నా శోభితకి జరిగే డామేజే ఎక్కువ. ఈ విషయంలో ఇద్దరూ ఇంతవరకు స్పందించకపోయినా శోబిత సోషల్ మీడియాలో మధ్యవేలును చూపుతూ వీడియో పెట్టింది.

To everyone who made a mess
— Arisetty Prasad (@PrasadAGVR) June 24, 2022
A reply can't better than this ???????? pic.twitter.com/alHr0qb0gV
ఈ వీడియో తనపై వచ్చిన గాసిప్స్ గురించే అని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇక చైతన్య మాత్రం ఇప్పటివరకు ఈ రూమర్స్ పై పరోక్షంగా కూడా స్పందించలేదు. చైతూ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో హిట్ కొట్టిన చైతన్య ఇప్పుడు మరోసారి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వములో థాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ధూత్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అడుగుపెడుతున్నాడు. ఇక ఈ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.































