Health News

కరోనా సోకకుండా మాస్క్ వాడేవారికి షాకింగ్ న్యూస్..?

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పట్లో వైరస్ ఉధృతి ఆగేలా కనిపించడం లేదు. కరోనా మహమ్మారి సోకకుండా ఉండటానికి ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం మినహా మరో మార్గం లేదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో మాస్క్ ల గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాస్క్ వాడినా కరోనా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు మాస్కుల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. మాస్కులు కరోనా వైరస్ ను అడ్డుకోగలవని అయితే పూర్తిస్థాయిలో మాత్రం కాదని వెల్లడించారు. టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మనుషుల తలలను పోలిన బొమ్మలను ఉంచి వాటికి ఎదురుగా వైరస్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కాటన్ మాస్క్ కేవలం 40 శాతం మాత్రమే వైరస్ ను అడ్డుకుంటుందని తేల్చారు.

కాటన్ మాస్కులతో పోలిస్తే ఎన్ 95 మాస్కులు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని… ఎన్ 95 మాస్కులు 90 శాతం వరకు కరోనా వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నాయని చెప్పారు. మాస్కులు పెట్టుకున్నా వైరస్ సోకదనే గ్యారంటీ లేదని సాధారణ మాస్కులతో పోలిస్తే ఎన్ 95 మాస్కులు ధరించడం ఉత్తమమని వెల్లడించారు. తేమలో ఈ వైరస్ విచ్చిన్నం అవుతున్నట్టు గుర్తించామని తెలిపారు.

మరోవైపు కరోనా మహమ్మారి గురించి వెలుగులోకి వస్తున్న కొత్త వార్తలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం మరో రెండేళ్ల వరకు కరోనా వ్యాక్సిన్ రాదంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుండటం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

30 ఏళ్ళ ఉద్యోగ ప్రతిష్టకు… లగ్జరీ కార్లతో సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ..

కేరళలోని ప్రముఖ రిటైల్‌ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్‌ప్రైజ్…

35 seconds ago

నో చికెన్.. నో మటన్! టీమిండియా నెక్స్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కఠిన నిర్ణయం..

టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…

12 minutes ago

సర్పంచులకు భారీ ఊరట..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…

21 minutes ago

ప్రసవ వేదనతో ఆవేదనాత్మక ఘటన.. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం..!

ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…

31 minutes ago

రూ.75 కోట్ల ‘మండాడి’లో సుహాస్ షాకింగ్ రోల్.. రూట్ మార్చిన యంగ్ హీరో

తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…

44 minutes ago

లవ్ ఫీలింగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్.. ఆ లక్కీ గర్ల్ ఎవరు?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

54 minutes ago