భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పట్లో వైరస్ ఉధృతి ఆగేలా కనిపించడం లేదు. కరోనా మహమ్మారి సోకకుండా ఉండటానికి ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం మినహా మరో మార్గం లేదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో మాస్క్ ల గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాస్క్ వాడినా కరోనా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు మాస్కుల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. మాస్కులు కరోనా వైరస్ ను అడ్డుకోగలవని అయితే పూర్తిస్థాయిలో మాత్రం కాదని వెల్లడించారు. టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మనుషుల తలలను పోలిన బొమ్మలను ఉంచి వాటికి ఎదురుగా వైరస్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కాటన్ మాస్క్ కేవలం 40 శాతం మాత్రమే వైరస్ ను అడ్డుకుంటుందని తేల్చారు.

కాటన్ మాస్కులతో పోలిస్తే ఎన్ 95 మాస్కులు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని… ఎన్ 95 మాస్కులు 90 శాతం వరకు కరోనా వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నాయని చెప్పారు. మాస్కులు పెట్టుకున్నా వైరస్ సోకదనే గ్యారంటీ లేదని సాధారణ మాస్కులతో పోలిస్తే ఎన్ 95 మాస్కులు ధరించడం ఉత్తమమని వెల్లడించారు. తేమలో ఈ వైరస్ విచ్చిన్నం అవుతున్నట్టు గుర్తించామని తెలిపారు.

మరోవైపు కరోనా మహమ్మారి గురించి వెలుగులోకి వస్తున్న కొత్త వార్తలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం మరో రెండేళ్ల వరకు కరోనా వ్యాక్సిన్ రాదంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here