Shriya : సినిమా ప్రపంచం అంటేనే గ్లామర్ కు మరో పేరు. ఇక హీరోయిన్లు ఈ గ్లామర్ ప్రపంచాన్ని ఏలేస్తూ ఉంటారు. కొంతమంది తమ గ్లామర్ తో సినిమాలలో రానించగలిగిన కొన్ని రోజులకే ఫేడ్ అవుట్ అవుతుంటారు. ఇక మరి కొంతమంది మాత్రం తమ అందచందాలతో పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినా, ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా తమ గ్లామర్ తో కట్టిపడేస్తుంటారు. ఈ కోవలోకే వస్తుంది శ్రియ. ‘ఇష్టం’ సినిమాతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది శ్రియ. అప్పటినుండి ఇప్పటివరకు అభిమానులను అలరిస్తూనే ఉంది.

సముద్ర తీరాన… బికినీలో…
శ్రియ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు కావొస్తున్నా అభిమానులలో ఆమె మీద క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. దశాబ్దం పాటు టాలీవుడ్లో అగ్ర కథానాయికగా వెలిగింది శ్రియ. దాదాపు అందరు టాప్ హీరోల సరసన నటించింది. అయితే శ్రియ పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త దూరం అయిన సంగతి తెలిసిందే. పాప పుట్టిన తరువాత మళ్ళీ సినిమాలలో హీరోయిన్ గా కాకుండా సహాయక పాత్రలలో నటిస్తోంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉండే శ్రియ, తనకు, తన కుటుంబానికి సంబందించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం కుటుంబంతో కలసి సరదాగా గడుపుతున్న శ్రియ సముద్రతీరాన బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు శ్రియలో గ్లామర్ డోస్ ఇంకా తగ్గలేదు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.


































