Shruthi Hassan: సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి శృతిహాసన్ ఒకరు.ఈమె రీఎంట్రి తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈమె నటించిన వాల్తేరు వీరయ్య,వీర సింహారెడ్డి సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.
ఇకపోతే శృతిహాసన్ ఇది వరకు మెగా కాంపౌండ్ లో పలువురు హీరోలతో కలిసి నటించారు. అయితే ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విషయాన్ని అందుకోవడంతో కొందరు శృతిహాసన్ మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈమె ఇది వరకే పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ కాటమరాయుడు సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి.
పవన్ కళ్యాణ్ తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా శృతిహాసన్ సందడి చేశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్. ఇక ఈమె అల్లు అర్జున్ సరసన రేసుగుర్రం సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అలాగే రామ్ చరణ్ తో కలిసి ఎవడు సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది.
ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా థియేటర్లలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ భారీ కలెక్షన్లను రాబడుతుంది.ఇలా మెగా హీరోలు అందరితో కలిసి శృతిహాసన్ నటించిన సినిమాలన్నీ హిట్ కావడంతో ఈమె మెగా హీరోలకు హీరోయిన్ గా మారిపోయింది. శృతిహాసన్ కు ఇక పై మెగా హీరోలు మరికొన్ని సినిమాలలో అవకాశం కల్పించే సూచనలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా సలార్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…