Shyamala Devi : సెప్టెంబర్ 11 2022 న లెజెండ్రి యాక్టర్ కృష్ణం రాజు గారు పోస్ట్ కోవిడ్ సమస్యల వల్ల 83 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. ఇక ఆయన కుటుంబం, ఆయన పిల్లల గురించి సోషల్ మీడియాలో వెతకడం వంటివి కూడా ఎక్కువయ్యాయి. రాజవంశానికి చెందిన కృష్ణం రాజు గారు, ఆయన కుటుంబం నుండి ఎవరినీ పెద్దగా మీడియా ముందుకు తీసుకురాలేదు. ఇక ఆయన సతీమణి శ్యామలా దేవి గారు మాత్రం ఆయనకు ఎపుడూ వెంట ఉంటూ ఉండేవారు. ఇక ఆవిడ గురించి కూడా చాలా మందికి తెలియదు.

సమాజసేవలో శ్యామల దేవి గారు…
కృష్ణం రాజు గారి మొదటి భార్య సీతా దేవి గారు ఆయనకు స్వయానా మేనకోడలు. సీతా దేవి, కృష్ణం రాజు గారి దంపతులకు పిల్లలు లేని కారణంగా వారు ఒక పాపని దత్తత తీసుకుని పెంచుకున్నారు. ఆ అమ్మాయి పేరు ప్రశాంతి. ఇక ఆ తరువాత కొంతకాలానికి సీతా దేవి గారు కారు ఆక్సిడెంట్ లో మరణించడంతో కృష్ణం రాజుగారు డిప్రెషన్ లోకి వెళ్లారు. అయన అలా ఉండటం చూసిన ఆయన తండ్రి ఆయనకు శ్యామల గారిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. శ్యామల గారికి ఈ పెళ్లి సమయానికి 28 ఏళ్ళు ఇక కృష్ణం రాజు గారికి 56 ఏళ్ళు. అయినా ఆమె రెండో పెళ్లి వాడిని ఒప్పుకోవడం ఇష్టాపూర్వకంగానే ఒప్పుకుందా అనే సందేహం తో ఆమెకు ఈ పెళ్లి ఇష్టమేనా లేకపోతే పెద్దల బలవంతమా అని కనుక్కోడానికి వెళితే ఆవిడ ఇష్టం అని చెప్పడం తో చేసుకున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అయితే మొదటి బిడ్డ ప్రశాంతి ని కూడా తన బిడ్డలాగే చూసుకున్నారు శ్యామల.

మహాత్మ గాంధీ పేరు తో సామాజిక సేవకు శ్రీకారం చుట్టి అటు భర్త, కుటుంబమే కాకుండా శ్యామల గారు సమాజం కోసం పని చేశారు. కరోనా సమయంలో కూడా స్వయంగా వండిపెట్టి పోలీసులకు అన్నం పెట్టేవారట. ఇక కరోనా సమయంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలను కూడా చేశారు. ఇక తన భర్తకు షూటింగ్ సమయంలో ఖచ్చితంగా ఇంటి భోజనం ఆవిడే వండి పంపేవారట. ఎల్లపుడూ ఆయనకు తోడుగా ఉండేవారట. ఎపుడైనా పుట్టింటికి వెళ్లాలన్నా ఎవరినైనా కృష్ణం రాజు గారికి తోడు ఉంచి వెళ్ళేవారట శ్యామలా దేవి. ఇక ఆయన మరనించాక ఆయన పాడె మోసి ఆయన మీద ఉన్న ప్రేమ చాటుకున్నారు.




























