Sid Sriram : ఎంతో మందో నేటితరం సింగర్స్ ఉన్నా అందరిలోనూ సిద్ శ్రీరామ్ వేరు. ఒక స్టార్ హీరో కి ఉన్నంత ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. సిద్ శ్రీరామ్ పాడిన పాట ఒక్కటైనా సినిమాలో ఉంటే చాలు అనేలా సినిమా తీసే వాళ్ళు భావిస్తున్నారు. ఇపుడు సౌత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న సింగర్ అంటే సిద్ శ్రీరామే. ఇక తెలుగులో క్రేజ్ గురించి వేరే చెప్పకర్లేదు. ‘ఇంకేం ఇంకేం కావాలె’ అంటూ పాడినా, ‘చూపే బంగారమాయేనా శ్రీ వల్లి’ అని పాడినా ఆడియన్స్ మాత్రం అతని గాత్రానికి ఫిదా అయిపోతున్నారు. సౌత్ సింగర్స్ లో ఇపుడు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సింగర్ కూడా సిద్ శ్రీరామే. అయితే శ్రీరామ్ పాటల్లో పద ఉచ్చారణ గురించి ఇంతకు ముందు కూడా చర్చ జరిగింది.

తెలుగు పద ఉచ్చారణ సరిగా లేదు…
తాజాగా పమిడికాల్వ మధు అనే వ్యక్తి యూట్యూబ్ ద్వారా సిద్ పాడిన తెలుగు పాటలపై అభ్యంతరం వ్యక్తం చేసాడు. తెలుగు ఉచ్చారణ సరిగా రాదని కొన్ని పదాలను తప్పుగా పలుకుతున్నాడు అని చెప్పారు. ఇక నుంచైనా సిద్ శ్రీరామ్ పాడే పాటల్లో ఉంటే.. కంటే.. ఒంటి.. అనే పదాలను రాయొద్దు వాటిని అతడు ఉల్టే.. కల్టే.. ఒల్టి అని తప్పుగా పాడుతున్నాడు అని విమర్శించారు. అలాగే దాక్కుందాం.. పదాన్ని దాల్కుందాం అని, కొట్టుకుందాం అనే పదాన్ని కొట్టుకుల్దాం ని పాడి తెలుగు పదాలను చంపేస్తున్నాడని వాపోయాడు.

ఇప్పటికైనా సంగీత దర్శకులు, హీరోలు వీటిని గమనిస్తే మంచిది మీకు ఇవన్నీ ఎన్ని రోజులు కనిపించలేదా అంటూ మాట్లాడారు. దీనికి సంబంధిచిన వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. కొంతమంది నెటిజన్స్ ఈ వీడియోకి స్పందిస్తూ ఇప్పటికైనా ఒకరు దీన్ని గురించి మాటాడారు సంతోషం అంటూ చెప్పగా, మరొకరు నిజమే ఈ తప్పులను సరిదిద్దుకుంటే సిద్ మంచిది అంటూ చెబుతున్నారు. ఇక అలా వైకుంఠ పురంలో సినిమాలో ‘సామజవరగమనా’ పాట పాడిన సమయంలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ సిద్ ఉచ్చారణ గురించి కామెంట్స్ చేసారు. పాట చాలా బాగుంది ఒక తెలుగు సింగర్ తో పాట పాడించుంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డారు.
On point ????. Sid voice is amazing but need few corrections in his Telugu pronunciations. More than lyric writers, music directors should take care of this.
— Abhi (@abhi_is_online) August 24, 2022
Any day would prefer to listen #hemachandra #anuragkulkarni #SreeramaChandra and #Revanth over #SidSriram in Telugu. https://t.co/7gYZgAeqmC































