సైమా అవార్డుల్లో సందడి చేసిన తారలు.. 2019 విజేతల పూర్తి వివరాలు ఇవే!

సినీ ప్రపంచంలో అవార్డులు అనేవి నటుడి యొక్క టాలెంట్ ను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. ఇక చిత్రరంగంలో అత్యున్నత అవార్డుగా ఆస్కార్‌ను పరిగణిస్తుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రదర్శన కనబర్చిన వారికి ఇస్తుంటారు. మన భారతదేశంలో కూడా ఇలాంటి అవార్డులు ఎన్నో ఉన్నాయి.

అయితే వాటిలో దక్షిణాది చిత్రాలకు గుర్తింపు ఇవ్వడం.. ఇక్కడి నటీనటులను గౌరవించుకోవడం కోసం సైమాను ఏర్పాటు చేశారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలకు ప్రతీ ఏటా సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్( సైమా) అవార్డులను ప్రకటిస్తారు. ఈ సారి ఈ వేడుకలను హైద్రాబాద్‌లో నిర్వహిస్తున్నారు. దీతో ఈ అవార్డులు దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక సెప్టెంబర్ 18 న తారల రాకతో సైమా వేడుకలకు కొత్త కళ వచ్చింది. దిల్ రాజు, దేవీ శ్రీ ప్రసాద్, అనిల్ రావిపూడి, అల్లరి నరేష్, శివాత్మిక రాజశేఖర్, రాధిక శరత్ కుమార్, నివిన్ పాలి, అనురాగ్ కులకర్ణి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, సీనియర్ నటుడు మురళీమోహన్, యువ నటుడు కార్తికేయ, సీనియర్ నటి జీవిత ఇలా ఎంతో మంది తారలు వచ్చారు.

దక్షిణాది పరిశ్రమకు చెందిన దాదాపు సెలెబ్రిటీలందరూ సైమా వేడుకలకు హాజరు అయ్యారు. ఇక ఈ వేడుకల్లో మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహర్షి సినిమా సైమా 2019 నామినేషన్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు పది కేటగిరిల్లో మహర్షి సినిమా నామినేట్ అయింది. అయితే ఇందులో ఉత్తమ నటుడిగా మహేష్ బాబుకు అవార్డు దక్కింది. రాధిక, ఎంపీ సంతోష్ కుమార్ చేతల మీదుగా ఆ అవార్డును మహేష్ బాబు తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో 2019 , 2020 సంవత్సరంలో అవార్డుల కార్యక్రమాలు నిర్వహించలేదు. టాలీవుడ్‌కు సంబంధించి 2019వ సంవత్సరానికిగానూ విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తమ చిత్రంగా జెర్సీ, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎఫ్2 నిలిచాయి. ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు మహర్షి సినిమాల నుంచి నిలవగా.. ఉత్తమ నటిగా సమంత (ఓ బేబీ) ఈ అవార్డును గెలుచుకున్నారు.

క్రిటిక్స్ ఉత్తమ నటుడిగా నాని (జెర్సీ), క్రిటిక్స్ ఉత్తమ నటిగా రష్మికా మందన్న (డియర్ కామ్రెడ్) నిలిచారు. ఇక ఉత్తమ సహాయ నటుడిగా అల్లరి నరేష్ (మహర్షి), సహాయనటిగా లక్ష్మి (ఓ బేబీ) నిలిచారు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి), ఉత్తమ గేయ రచయిత శ్రీమణి(ఇదే కదా.. మహర్షి), ఉత్తమ గాయకుడు అనురాగ్ కులకర్ణి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్), ఉత్తమ గాయని చిన్మయి (మజిలీ-ప్రియతమా) నిలిచారు. కార్తికేయ గుమ్మకొండ ఉత్తమ విలన్ గా అవార్డు అందుకున్నారు. ఉత్తమ తొలి పరిచయ హీరగా శ్రీ సింహా (మత్తు వదలరా), ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్ గా శివాత్మిక రాజశేఖర్ (దొరసాని), ఉత్తమ తొలి పరిచయ దర్శకుడిగా స్వరూప్ ఆర్ఎస్‌జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ), ఉత్త తొలి పరిచయ నిర్మాత స్టూడియో 99 (మల్లేశం), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా సానూ వర్గీస్‌ (జెర్సీ), ఉత్తమ కమెడియన్ గా అజయ్ ఘోష్ (రాజుగారి గది 3) లు అవార్డులు గెలుచుకున్నారు.