Singeetham Srinivasa Rao: సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేస్తూ ప్రేక్షకులకు ప్రతి ఒక్క జానర్ లో సినిమాలను పరిచయం చేసిన దర్శకులలో ముందు వరుసలో ఉంటారు సింగీతం శ్రీనివాసరావు. ఈయన నేడు 90 వ ఏళ్లను పూర్తిచేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.ఇలా సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సేవలను చేసినటువంటి ఈయన నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో పెద్ద ఎత్తున ఈయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

1931 సెప్టెంబర్ 21వ తేదీ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఈయన నాటకాలపై మక్కువతో చిన్నప్పటినుంచి నాటకాలలో నటించేవారు. ఈ క్రమంలోనే థియేటర్ ఆర్ట్స్ లోడిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ రావు సంగీతంపై ఎంతో మక్కువ పెంచుకున్నారు. కెవి.రెడ్డి డైరెక్ట్ చేసిన యోగి వేమన, భక్తపోతన చిత్రాలను చూసి స్ఫూర్తి పొందాడు. వెంటనే దర్శకుడు కావాలన్న కోరికతో చెన్నై వెళ్లి కే.వి రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు.
ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి ఈయన తన డైరెక్టర్ గా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సొమ్మొకడిది సోకొకడిది, అమావాస్య చంద్రుడు విచిత్ర సోదరులు, పుష్పక విమానం, మయూరి ఆదిత్య 369,భైరవద్వీపం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత ఈయనకే చెల్లిందని చెప్పాలి.

Singeetham Srinivasa Rao: ప్రాజెక్టు కే లో సింగీతం శ్రీనివాస్…
ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఈయన ప్రస్తుతం నాకు అశ్విన్దశకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి ప్రాజెక్టుకే సినిమాలు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.ఇలా ఎన్నో ఏళ్లగా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నటువంటి ఈయన నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.




























