Singer KK : కృష్ణ కుమార్ కున్నాత్ అలియాస్ కేకే. ఎన్నో వేల పాటలు పాడిన ఈ గాయకుడి గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ఆయన పాటలోనే మనము ఎన్నోసార్లు సేద తీరామని తెలుసా.. తెలుగు భాషలోనే కాదు హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, అస్సామి, బెంగాలీ, గుజరాతి వంటి భాషలలో వేళ పాటలకు తన గాత్రంతో ప్రాణం పోశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పాట పడే కార్యక్రమంలోనే అస్వస్థతకు లోనై హోటల్ గదికి వెళ్ళాక కుప్పకూలీ అక్కడే మరణించారు. అభిమానులకు దుఃఖం మిగిల్చి అర్ధంతరంగా వెళ్లిపోయారు.

కేకే కెరీర్ కు కారణం భార్య జ్యోతి…..

కేకే మరణించాక ఆయన వ్యక్తిగత జీవితం గురించి అందరు ఆరా తీస్తున్నారు. నిజానికి కేకే ఢిల్లీ వాసి. ఆయన ఆరవ తరగతి చదివే సమయంలోనే భార్య జ్యోతి లక్ష్మి పరిచయం, ఇద్దరు మంచి స్నేహితులు. ఆ స్నేహం వారితో పాటే పెరిగి పెద్దయ్యాక ప్రేమగా మారింది. 1991 లో కేకే జ్యోతి తో తన వివాహ బంధాన్ని మొదలుపెట్టారు. నిజానికి కేకే సింగర్ గా తన కెరీర్ మొదలుపెట్టలేదు. కుటుంబ భాద్యతలను తీసుకోవడం వల్ల సేల్స్ మ్యాన్ గా జీవితం ప్రారంభించాడు.

అయితే తన భార్య ప్రోత్సాహంతో గాయకుడిగా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఇక 1994 లో మొదట యాడ్స్ కి జింగిల్స్ పాడేవారు. అలా బాలీవుడ్ లో పాటలు పాడటం కంటే ముందే కేకే 3000 కు పైగా జింగిల్స్ చేసారు. ఏ ఆర్ రెహ్మాన్ ప్రోత్సాహంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఇక భారతీయ భాషల్లో సుమారు చాలా భాషల్లో పాటలు పాడి అభిమానులను సొంతం చేసుకున్నారు.
































