Singer KK : కృష్ణకుమార్ కున్నాత్ విరహ గీతాల స్పెషలిస్ట్, ఎవరు ఈ సింగర్ అనుకుంటున్నారా ఎవరో కాదు కేకే. చెలియా చెలియా అంటూ వెంకటేష్ ఘర్షణలో పాడినా, చెలియా చెలియా అంటూ రామ్ చరణ్ ఎవడు లో పాడినా ఆ విరహ గీతాల వెనుక ఉన్న గాత్రమా మాత్రం కేకే దే. ఎక్కువగా ఎవరు ఆయన్ను చూసుండరు, పలానా పాట అతనే పాడదని తెలిసుండదు కానీ కేకే మాత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ , అస్సామి, బెంగాలీ, గుజరాతి భాషలలో కలిపి 800 పైగా పాటలను పాడాడు. ఆ గాత్రం మనల్ని వీడి పోయింది. మంగళవారం రాత్రి కలకత్తా ప్రదర్శన తరువాత గుండెపోటుతో మరణించారనే వార్త ఒక్కసారిగా సంగీతం ప్రియులను షాక్ కి గురి చేసింది.

ఎన్నో అనుమానాలు…అసలు జరిగింది ఏమిటి….
అసలు కే కే మృతికి నిజంగా గుండెపోటే కారణమా అనే అనుమానాలు ఇప్పుడు బయలుదేరాయి. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకోవడం ఈ అనుమానలకు మరింత బలాన్నిచ్చింది. ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న చివరి కన్సర్ట్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కేకే ఆ ప్రదర్శనలో ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుస్తోంది. యాజమాన్యం సరిగా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల చాలా మంది జనం ఉన్నా ఆడిటోరియంలో ఏసీ లేకపోవడం కనీసం ఫ్యాన్ కూడా లేకపోవడంతో ఇబ్బందికి లోనయ్యారు.

కోల్‌కతా నజ్రుల్ మంచాలోని గురుదాస్ కాలేజ్ వద్ద జరిగిన కాన్సెర్ట్‌లో పాల్గొన్న కేకే అంత జనంలో గాలి ఆడక పోవడంతో చెమటలు పట్టి తట్టుకోలేక యాజమాన్యంకి స్వయంగా తన అవస్థను చెప్పినా సరిగా స్పందించకపోవడంతో కన్సర్ట్ ముగిసాకా హోటల్ ఒబెరాయ్ కి వెళ్లి ఛాతిలో భారంగా ఉందని సిబ్బందికి చెప్పారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లినా ఆయన అప్పటికే మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని సీఎంఆర్‌ఐ ఆస్పత్రిలో ఉంచారు. పోస్ట్ మార్టం పూర్తి అయితేనే ఆయన మృతికి గల అసలు కారణం తెలుస్తుంది.
AC wasn’t working at Nazrul Mancha. he performed their and complained abt it bcoz he was sweating so badly..it wasnt an open auditorium. watch it closely u can see the way he was sweating, closed auditorium, over crowded,
— WE जय (@Omnipresent090) May 31, 2022
Legend had to go due to authority’s negligence.
Not KK pic.twitter.com/EgwLD7f2hW



































