Singer Parvathi : తెలుగులో టీవీ ఛానెల్స్ లో వస్తున్న సింగింగ్ షోలలో జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగమప సింగింగ్ షో ఒకటి. ఇక ఈ ప్రోగ్రామ్ కొత్త సీజన్ లో సింగర్ గా పార్వతి అనే అమ్మాయి సంచలనమే సృష్టించింది. మనిషి అందంతో కన్నా ప్రతిభతోనే ఎక్కువ గుర్తించబడతాడని నిరూపించింది. తన గాత్రంతో అందరి మనసు దోచుకుంటున్న పార్వతి, మొదటి సారి షో లో పాట పాడి తన గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించింది. తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది పార్వతి.

ఎమోషనల్ అయిన సోదరుడు…
పార్వతి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చింది. ఇక జడ్జెస్ సహకారంతో రోజు రోజుకూ తన గాత్రాన్ని మెరుగుపరుచుకుంటూ, పాటలను అద్భుతంగా పాడుతున్న పార్వతి లేటెస్ట్ గా నరుడా ఓ నరుడా పాటను పాడిన ప్రోమో జీ తెలుగులో విడుదల చేసారు. ఇక ప్రోమోలో తన సోదరుడు కూడా స్టేజి పై కనిపిస్తాడు. పార్వతి ఇంతకు ముందు ఎదుర్కొన్న అవమానాలను చెబుతూ కన్నీరు పెట్టుకుని అందరినీ ఎమోషనల్ చేసాడు.

ఇక ఈ ప్రోమో ఇప్పడు పార్వతి అభిమానులను ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. ఈ వారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ఈ ప్రోమోలో పార్వతి తన తమ్ముడు ల ఎమోషనల్ జర్నీ చూపించబోతున్నారు. ఇక తన ప్రతిభతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న పార్వతి సీజన్ విన్ అవ్వాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.



























