Singer Rahul Sipliganj : తెలంగాణ హైదరాబాద్ దూల్ పేట్ కు చెందిన రాహుల్ సిప్లిగంజ్ తన యూట్యూబ్ ఛానెల్ లో సొంతంగా ఆల్బమ్స్ చేసి పెడుతూ పేరు తెచ్చుకున్నాడు. అలా మగజాతి, మంగమ్మ, మైసమ్మ వంటి ఆల్బమ్స్ తో ఫేమస్ అయిన రాహుల్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘జోష్’ సినిమాలో మొదటిసారిగా పాట పాడిన రాహుల్ ఆ తరువాత ‘దమ్ము’ సినిమాలో వాస్తు బాగుందే పాటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ కి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు వచ్చిన పాట ‘రంగస్థలం’ సినిమాలో పడిన రంగ రంగ రంగస్థలాన పాట. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో సింగర్ కాలభైరవ తో కలిసి పాడిన నాటు నాటు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు ఏకంగా మొదటిసారిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఒక భారతీయ గీతానికి తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో కెరీర్ లో మంచి సక్సెస్ చూస్తున్న రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అవార్డు రావడం గురించి ఆ మధురానుభూతులను పంచుకున్నారు.

ప్రధాని ఫాలో అవడం కంటే ఏం కావాలి…
రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం తన కెరీర్ లో పీక్ స్టెజ్ లో ఉన్నాడనే చెప్పొచ్చు. నాయి నాటు పాట తెచ్చిన క్రేజ్ ఒకవైపు గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి అవార్డులు మరో వైపు అతి తక్కువ కెరీర్ స్పందనలోనే అంతర్జాతీయ అవార్డులను చూసిన రాహుల్ తన ఆనందాన్ని ఇంటర్వ్యూలలో పంచుకుంటున్నారు. అంతర్జాతీయ గుర్తింపుతో పాటు దేశీయంగా బాలీవుడ్ నుండి అలాగే సినిమా, క్రికెట్ అనే బేధం లేకుండా ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్తున్నారంటూ తెలిపారు.

ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తనను గోల్డెన్ గ్లోబ్ అవార్డు సందర్బంగా మొత్తం టెక్నీషియన్స్ అందరినీ ట్యాగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నన్ను ఫాలో చేస్తున్నారు. ఒక దేశ ప్రధాని తెలుగు సింగర్ ను ఫాలో చేయడం కంటే గొప్ప విషయం ఏముంటుంది. అది చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటూ చెప్పారు. ఇక ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ వంటి వారు నాకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.



























