Singer Sai chand wife Rajani : ఆరోజు ప్రమాణ స్వీకారం ఎందుకు చేసానంటే… సాయి చంద్ చెల్లి గురించి మావయ్యకి అపుడే చెప్పాను…: సింగర్ సాయి చంద్ భార్య రజని

0
187

Singer Sai chand wife Rajani : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తన గానంతో రగిలించి తెలంగాణ సాధనలో తనవంతు పాత్ర పోషించిన సింగర్ సాయి చంద్ అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారు. బాల్యం నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ పెరిగిన సాయి చంద్ విద్యార్థి దశ నుండి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి కెసిఆర్ ప్రభుత్వంలో గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ రాజకీయంగా భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశపడ్డాడు. అయితే అంతలోనే తన ఆయుష్షు తీరిపోయింది. చిన్న వయసులోనే భార్య బిడ్డలను అనాథలను చేసి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన పదవిని ఆయన భార్య రజని కి తెలంగాణ ప్రభుత్వం అప్పగించగా తాజాగా ఇంటర్వ్యూలో ఆమె తన భవిష్యత్ ప్రణాళికలు అలాగే కుటుంబం గురించి మాట్లాడారు.

ప్రమాణ స్వీకారం ఆరోజు చేయడానికి కారణం… ఆడబిడ్డ గురించి ఆరోజే…

సాయి చంద్ గారి హఠాన్మరణం తరువాత ఆయన భార్య రజని కోలుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. ఆపైన సాయి చంద్ గారు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉండగా ఆ పదవిని ఆయన భార్యకు అప్పగించగా ఆ పదవి ప్రమాణ స్వీకరానికి సాయి చంద్ గారి తండ్రి రాకపోవడం గురించి రజని గారు క్లారిటీ ఇస్తూ ఆరోజు బాగా వర్షం ఉండటం, ఎవరినీ పిలవాలని అనుకోకుండా సింపుల్ గా ప్రమాణ స్వీకారం చేయాలనుకోవడం వల్ల ఆరోజు నా భర్త ఫోటోతో ఆఫీస్ వెళ్లి ప్రమాణ స్వీకారం చేశాను అంతే అయినా తెలుసుకుని చాలా మంది వచ్చారు. ఎవరినీ నేను పిలవలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇక ఆడపడచు గురించి చెబుతూ ఆమెకు కూడా ప్రభుత్వం 25 లక్షలు ఇవ్వగా ఆ డబ్బును తన సొంత అకౌంట్ లో వేసుకుని తన చదువుకు ఉపయోగించాలని సలహా ఇచ్చానని, తనకు ఏదైనా సహాయం కావాలంటే తానున్నట్లు భరోసా ఇచ్చినట్లు అయితే చిన్నతనం నుండి తాను చదువులో చురుగ్గా ఉంటూ గురుకుల పాఠశాలలో చదువుకుందని ఎవరి మీద ఆధారపడకుండా చదువుకుందని రజని తన అడపడుచు వెన్నెల గురించి చెప్పారు. ఇక వెన్నెల పుట్టకముందే సాయి చంద్ తో తనకు పరిచయం ఉందని వాళ్లంటికి వెళ్ళినపుడు వెన్నెల పేరు వేరే పెడితే బాగుంటుందని కూడా మావయ్య కి సూచించినట్లు తెలిపారు. మా కళ్ళముందు పుట్టి పెరిగిన అమ్మాయి తనతో ఎలాంటి విబేధాలు లేవు అంటూ చెప్పారు.