Singer Sai Chand wife Rajani : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ తన గాత్రంతో వేల మందిని ఉత్తేజపరిచి ఉద్యమం వైపు నడిపిన గొంతు నేడు మూగబోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలు పాడి తెలంగాణ ధూమ్ ధామ్ అంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచిన 30 ఏళ్ల సాయి చంద్ గుండెపోటుతో మరణించారు. తెలంగాణ ఉద్యమం తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సాయి చంద్ మరణం తీవ్ర విషాదాన్ని మిగల్చింది. చిన్న వయసులోనే ఆయన మృతి ఆయన భార్య, పిల్లలకు తీరని లోటు. నిజానికి సాయి చంద్ గాయకుడయితే ఆయన భార్య రజని నాట్యకారిని. వారిది ప్రేమ వివాహం కావడం విశేషం. ఇక ఆయన మరణించాక మొదటి సారి మీడియాతో మాట్లాడిన సాయి చంద్ భార్య రజని ఆయన ఆశయాల గురించి ఆయన జ్ఞాపకాల గురించి మాట్లాడారు.

సాయి చంద్ తల్లి మరణం…
చిన్నప్పటి ఉంది పేదరికంలో కష్టాలు పడి పెరిగిన సాయి చంద్ గారిని ఆయన తల్లి కష్టపడి సాకారు. ఆమె బీడీ కర్మికురాలంటూ రజని తెలిపారు. బీడీలు చుట్టి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఇద్దరు కొడుకులు ఉన్న ఊరిలోనే ఎస్సీ హాస్టల్ లో ఉండి అన్నం తిని రాత్రికి ఇంటికి వచ్చి పడుకునేవరట. పగలంతా ఆమె బీడీలు కట్టి పనిచేసేవారు, సాయి చంద్ ఎపుడూ తన తల్లిని తలుచుకుని బాధపడేవారు అంటూ రజని తెలిపారు. ఇక ఇల్లు ఆమె కల అయితే కట్టుకున్న ఏడాదికే బట్టలు ఆరెస్తు తంతకి కరెంట్ పాస్ అవడం వల్ల షాక్ కొట్టి మరణించారు.

ఆమెను కాపాడబోయి సాయి చంద్ కి కూడా షాక్ కొట్టింది. ప్రజా ఉద్యమాల బాట పట్టడం వల్ల తండ్రి కంటే తల్లితో ఎక్కువగా ఉన్నాడు. అందువల్ల ఆమె మరణం తరువాత ఆరు నెలలు అసలు వెలుగు చూడకుండా చీకటిలో అలా ఉండిపోయాడట. ఆరు నెలలు సరిగా తిండి తినక ఇబ్బందులు పడ్డారు. తన అన్న అమ్మ లేని బాధ మరచిపోడానికి ఆర్మీలోకి వెళ్ళిపోయాడు. సాయి చంద్ వయసు తల్లి చనిపోయినపుడు 16 ఏళ్లు, నరకం అనుభవించారు, అవన్నీ చెప్పి ఎపుడూ తల్లిని తలుచుకుని బాధపడేవారు. ఆయన మరణం నేను తట్టుకోలకపోతున్నాను. అందుకే ఆయన చనిపోయారు అనుకోవడం లేదు ఎక్కడో ఉన్నారు మళ్ళీ వస్తారు అన్నట్లుగా బ్రతుకుతున్నా. ఆయన చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తాను అంటూ చెప్పారు రజని.



























