Singer Sai Chand wife Rajani : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తన గానంతో రగిలించి తెలంగాణ సాధనలో తనవంతు పాత్ర పోషించిన సింగర్ సాయి చంద్ అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారు. బాల్యం నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ పెరిగిన సాయి చంద్ విద్యార్థి దశ నుండి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి కెసిఆర్ ప్రభుత్వంలో గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ రాజకీయంగా భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశపడ్డాడు. అయితే అంతలోనే తన ఆయుష్షు తీరిపోయింది. చిన్న వయసులోనే భార్య బిడ్డలను అనాథలను చేసి ఆయన తుది శ్వాస విడిచారు. తాజాగా ఆయన పదవిని ఆయన భార్య రజని కి తెలంగాణ ప్రభుత్వం అప్పగించగా తన భర్త గురించి అలాగే తన పిల్లల భవిష్యత్ గురించి ఆమె ఇంటర్వ్యులో మాట్లాడారు.

చివరగా చెప్పింది అదే…
ప్రేమించుకున్న సమయంలోనూ అలాగే పెళ్ళైన తరువాత కూడా ఎపుడూ బిజీ గానే ఉన్నారు. పెళ్లి అయిన వెంటనే కూడా మళ్ళీ సభలంటూ వెళ్ళిపోయేవారు. అలాంటి ఆయన చనిపోయే రోజు సాయంత్రం ఇంటికి వచ్చారు. ఎపుడు రాత్రి పన్నెండు దాటాక ఇంటికి వచ్చే ఆయన ఆరోజు సాయంత్రం మూడుకే ఇంటికి వచ్చి నీతో పిల్లలతో గడపాలని ఉంది అంటూ స్కూల్ నుండి పిల్లలను నేను తీసుకువస్తాను, ఇక్కడ ఉంటే కలవడానికి అనిసెవరో ఒకరు వస్తూనే ఉంటారు బయటికి వెళ్దాం అని చెప్తే మా అమ్మమ్మ వాళ్ళ తోటకు వెళ్దాం అని అక్కడికి వెళ్లి అక్కడ నేనే స్వయంగా వంట వండితే తిని నవారు మంచం మీద పడుకుని చాలా సేపు మాట్లాడారు.

తన చిన్నతనం నుండి మొదలు ఈరోజు వరకు జరిగిన విషయాలను అలాగే పిల్లల భవిష్యత్ ఏంటి, ఏం చదివించాలి ఇలా అన్నీ మాట్లాడారు. అప్పటికే పన్నెండు అయిందని వెళ్లి పడుకోమని చెప్పాను. లోపలికి వెళ్లి పిల్లలతో పాటు పడుకున్నారు. పడుకుని కొద్ది సేపటికి బాత్రూంకని లేస్తూ అలానే కుప్పకూలారు. 15 నిమిషాల్లో హాస్పిటల్ తీసుకువెళ్లాము. ఆ సంఘటనలన్నీ ఇంకా కళ్ల ముందే ఉన్నాయి అంటూ ఎమోషనల్ అయ్యారు రజని.