Singer Sai Chand wife Rajani : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ తన గాత్రంతో వేల మందిని ఉత్తేజపరిచి ఉద్యమ వైపు నడిపిన గొంతు నేడు మూగబోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలు పాడి తెలంగాణ ధూమ్ ధామ్ అంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరచిన 39 ఏళ్ల సాయి చంద్ గుండెపోటుతో మరణించారు. తెలంగాణ ఉద్యమం తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సాయి చంద్ మరణం తీవ్ర విషాదాన్ని మిగల్చింది. చిన్న వయసులోనే ఆయన మృతి ఆయన భార్య, పిల్లలకు తీరని లోటు. నిజానికి సాయి చంద్ గాయకుడయితే ఆయన భార్య రజని నాట్యకారిని. వారిది ప్రేమ వివాహం కావడం విశేషం. ఇక ఆయన మరణించాక మొదటి సారి మీడియాతో మాట్లాడిన సాయి చంద్ భార్య రజని ఆయన ఆశయాల గురించి ఆయన జ్ఞాపకాల గురించి మాట్లాడారు.

ఆయన చివరగా మాట్లాడింది అదే…
ఎపుడూ బిజీగా ఉండే సాయి చంద్ గారు వేలకు భోజనం చేయడం లాంటివి చేయకపోవడం వల్ల గతంలో ఒకసారి సభ ముగించుకుని ఇంటికి వెళ్తూ కుప్పకూలారు. అపుడు హాస్పిటల్ వెళ్లి అన్ని పరీక్షలు చేయించగా సరిగా టైంకి తినకపోవడం రెస్ట్ తీసుకోకపోవడం వల్ల గాలి బుడగ గుండె కి రక్తం తీసుకెళ్లే నాళాలలో చేరింది. అదే పగిలి పోవడం వల్ల ఏం కాలేదు, భవిష్యత్తులో ఏం కాకుండా ఇప్పటినుండే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు.

ఇక కరోనా సెంకండ్ వేవ్ లో కరోనా సోకినప్పుడు బ్రతకడని అనుకున్నాము. కానీ కెసిఆర్ గారు హరీష్ రావు గారు చొరవ తీసుకుని మెరుగైన వైద్యం అందేలా చేసారు. ఇక ఎపుడూ ఇలా దూరం అవుతారని అనుకోలేదు. అప్పటి వరకు పిల్లల గురించి తన బాల్యం గురించి మాట్లాడారు. అంతలోనే ఇలా జరిగిపోయింది. ఆయన లేరని అనుకోవడం లేదు, ఎక్కడికో వెళ్ళారు తిరిగి ఇంటికి వస్తారు అన్నట్లుగానే బ్రతుకుతున్నా, ఆయన ఆశయాల కోసం బ్రతుకుతాను అంటూ చెప్పారు రజని.