Singer Sushila : దాదాపు గా 60 దశాబ్దాల పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో గానకోకిలగా సినిమా పాటలు పాడిన సింగర్ సుశీల గారు పుట్టింది ఆంధ్రప్రదేశ్ విజయనగరం. మ్యూజిక్ డిప్లొమా చేసిన సుశీల గారు మొదట ఆల్ ఇండియా రేడియోలో పనిచేసారు. అలానే కచేరీలు ఇచ్చేవారు. అలా కెరీర్ లో సాగుతున్న సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరావు గారు కొత్త గొంతు కోసం వెతుకుతుండగా సుశీల గారిని సెలెక్ట్ చేసి ఆమెతో తొలిసారి 1950 లో తమిళ పాట పాడించారు. అప్పటికే మ్యూజిక్ ఇండస్ట్రీలో సింగర్స్ గా ఏలుతున్న జిక్కి, వసంత కుమారి, లీలాలను దాటుకుని ముందుకు వెళ్ళడం కష్టమే అయినా సుశీలమ్మ తన గాత్రంతో దాని సాధించారు. ‘మిస్సమ్మ’ సినిమాలోని పాటలకు మంచి గుర్తింపు వచ్చి అటు తమిళం, ఇటు తెలుగులో తిరుగులేని గాయనిగా మారారు. దాదాపు నలభై ఏళ్ళు అగ్ర గాయనిగా కొనసాగిన సింగర్ సుశీల గారి వ్యక్తిగత జీవితం కెరీర్ గురించి ఆమె ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సుశీల గారి కోడలు సింగర్…
సుశీల గారి కుటుంబంలో తనతో పాటు తన తమ్ముడు రామకృష్ణ కూడా సింగర్, అలానే ఆమె మేనకోడలు కూడా సింగర్, ఇప్పుడు మనవరాలు గిటారిస్ట్ గా ఉన్నారు. సుశీల గారి అబ్బాయి కి తన మేనకోడలు సంధ్య జయకృష్ణ ను ఇచ్చి పెళ్లి చేసారు. సంధ్య గారు కూడా మంచి సింగర్. ఎన్నో మంచి పాటలను పాడిన సంధ్య గారు అయితే కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు.

ఇంటి బాధ్యతలను తీసుకుని కుటుంబాన్ని చూసుకోడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే సింగర్ సంధ్య గారి గురించి సుశీల గారు చెబుతూ తన గాత్రం అచ్చం నాలానే ఉంటుంది, తాను పాడిన పాటలు నేను పాడానని చాలా మంది అనుకున్నారు అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.



























