Singer sushila : దాదాపు గా 60 దశబ్దాల పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో గానకోకిలగా సినిమా పాటలు పాడిన సింగర్ సుశీల గారు పుట్టింది ఆంధ్రప్రదేశ్ విజయనగరం. మ్యూజిక్ డిప్లొమా చేసిన సుశీల గారు మొదట ఆల్ ఇండియా రేడియోలో పనిచేసారు, అలానే కచేరిలు ఇచ్చేవారు. అలా కెరీర్ లో సాగుతున్న సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరావు గారు కొత్త గొంతు కోసం వెతుకుతుండగా సుశీల గారిని సెలెక్ట్ చేసి ఆమెతో తొలిసారి 1950 లో తమిళ పాట పాడించారు. మిస్సమ్మ సినిమాలోని పాటలకు మంచి గుర్తింపు వచ్చి అటు తమిళం, ఇటు తెలుగులో తిరుగులేని గాయనిగా మారారు. దాదాపు నలభై ఏళ్ళు అగ్ర గాయనిగా కొనసాగిన సింగర్ సుశీల గారి వ్యక్తిగత జీవితం కెరీర్ గురించి ఆమె ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

తమ్ముడు అలా చనిపోయాడు…
సుశీల గారి ఇంట్లో సింగింగ్ లో చాలా మంది ఉన్నారు. ఆమె తమ్ముడు కోడలు సంధ్య వాళ్ళ నాన్న కూడా సింగర్. అయితే ఎక్కువగా సినిమా పాటలను ఆయన పాడలేదు. ఇక అక్క కొడుకు రామకృష్ణ కూడా మంచి సింగర్. ఆయన గొంతు ఘంటసాల లాగా ఉంటుందని పేరుంది. ఆయన ఎన్నో పాటలను తెలుగు సినిమాలో పాడారు.

ఇక ఘంటసాల గారికి జబ్బు చేసి పడటానికి ఇబ్బందిపడినప్పుడు రామకృష్ణ గారే పాడారు. ఆయన నోటి క్యాన్సర్ వల్ల మరణించారని సుశీల తెలిపారు. ఇక రామకృష్ణ తనయుడు సాయి కిరణ్ నువ్వే కావాలి, ప్రేమించు వంటి సినిమాల్లో నటించిన హీరో. ఇక సుశీల గారికి ఒకేఒక కుమారుడు పేరు జయకృష్ణ. కొడుకంటే ఎంతో ఇష్టం ఉండే సుశీల గారు తన మేనకోడల్ని కోడలుగా చేసుకుని కుటుంబ బాధ్యతలు తీసుకోమని చెప్పారట. ఇక జయకృష్ణ గారికి ఇద్దరు కూతుర్లు అందులో పెద్దమ్మాయి శుభశ్రీ గిటారిస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వద్ద పనిచేసింది.



























