Singer &Writer Jayakumar : శివాజీ గైక్వాడ్ గా ఇండస్ట్రీలోకి వచ్చి తన స్టైల్ ఈతరం భాషలో చెప్పాలంటే తన స్వాగ్ తో అప్పటి ప్రేక్షకులనే కాకుండా ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్న హీరో రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ అయినా ఇండియా వైడ్ అభిమానులను సొంతం చేసుకున్న రియల్ పాన్ ఇండియన్ స్టార్ రజనీకాంత్. ఈయన మొదట కండక్టర్ గా పనిచేస్తున్నా ఆపైన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్ అయ్యారు. అయన ప్రస్థానం గురించి సింగర్ అలాగే రైటర్ అయినా జయకుమార్ కనగాల పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆవేశంతో కూడుకున్న బాల్యం… సినిమాల్లో స్వాగ్…
రజనీకాంత్ బాల్యం అంతా చాలా అల్లరిగా ఉండేవాడని, దొంగతనాలను చేస్తూ అడ్డొచ్చినవాళ్లతో గొడవలను పెట్టుకుంటూ తన వాళ్లను ఏదైనా అంటే కొట్టేయడం వంటివి చేస్తూ చాలా ఆవేశంగా ఉండేవాడని జయకుమార్ తెలిపారు. అయితే తండ్రి ఇలానే ఉంటే చెడిపోతాడని పలు పనులలో పెట్టినా మానేసేవాడట రజనీకాంత్. ఇక చివరికి కర్ణాటక బస్సు కండక్టర్ గా పని ఇప్పించగా ఆ బస్సు డ్రైవర్ కి రజనీకాంత్ నచ్చి తనతో పాటు నాటాకాలను వేయడానికి తీసుకెళ్ళేవాడట.

అలా తనలో టాలెంట్ చూసిన ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరమని చెన్నై పంపించి నెల ఖర్చులకు డబ్బు కూడా ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చారట. అలా వెళ్లిన రజనీకాంత్ అక్కడ తన స్టైల్ అలాగే యాక్టింగ్ తో పలు అవకాశాలను అందుకుని నేడు సువర్ స్టార్ అయ్యారంటూ జయకుమార్ తెలిపారు. చేతిలో రూపాయి లేకుండా చెన్నై వెళ్లిన రజని నేడు కోట్లను సంపాదించారని తెలిపారు. ఇక ఆయన పేరును కె బాలచందర్ గారు మార్చారని తెలిపారు.