Siri Hanumanth: సాధారణంగా ఏదైనా ప్రత్యేకమైన రోజులు పండుగలు వస్తే బుల్లితెర చానల్స్ ప్రత్యేకమైన ఈవెంట్లను ప్లాన్ చేయడంలో ముందు ఉంటారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం కావడంతో ఇప్పటికే ప్రతి ఒక్క ఛానల్ కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ మా లవ్ టుడే అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రియల్ లవర్స్ వర్సెస్ రీల్ లవర్స్ ను ఆహ్వానించారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ లో అయినటువంటి సిరి హనుమంత్, శ్రీహాన్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది.
శ్రీహాన్ కోసం సిరి వేదికపై ఎన్నో రకాల గిఫ్టులు ఇచ్చి తనకు సర్ప్రైజ్ చేసింది.గోల్డెన్ గులాబీ ఫ్లవర్ ఇస్తూ తాను చాలా యూనిక్ అంటూ తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చారు.తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు తనని చాలా మిస్ అయ్యానని అలా తన గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ షర్ట్ పై తాను కిస్ పెట్టే దాన్ని అంటూ ఒక షర్ట్ కానుకగా ఇచ్చారు. ఇలా పలు రకాల గిఫ్టులతో శ్రీహాన్ ను సర్ప్రైజ్ చేశారు.
ఇక వేదికపై సిరి మాట్లాడుతూ తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు. అయితే ఆ తప్పులను స్టేజ్ మీద ఎవరు ఒప్పుకోరని, నేను నిజంగానే నాకు తెలియకుండా తప్పు చేశాను అంటూ ఈమె ఒక్కసారిగా కన్నీటి పర్యంతరం అయ్యారు ఇలా సిరి కన్నీళ్లు పెట్టుకోవడంతో శ్రీహాన్ తనని దగ్గరకు తీసుకొని ఓదార్చారు. అయితే ఈమె బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో షణ్ముఖ్ జస్వంత్ తో చాలా చనువుగా ఉండడంతో వీరి గురించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి తలుచుకొని సిరి తప్పు చేశాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…