Siva balaji & Madhumitha : గొడవలయ్యి విడిపోయాం… పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోతుందని… ఒక్క పూట తినేవాడిని… ఆరోజు బాగా ఏడుపొచ్చింది…: శివబాలాజీ & మధుమిత

0
626

Siva balaji & Madhumitha : ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ బాలాజీ ఆ తరువాత ఎలా చెప్పను, దోస్త్ సినిమాల్లో నటించారు. అయితే శివ బాలాజీకి మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం ఆర్య. బన్నీ నటించిన ఆర్య సినిమాలో విలన్ షేడ్ ఉన్న పాత్రలో అజయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత సంక్రాంతి సినిమాతో మరో మంచి హిట్ అందుకున్న శివ బాలాజీ తన 17 ఏళ్ళ వయసులోనే తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ 22 ఏళ్లకే సొంత వ్యాపార సంస్థలను పెట్టాడు. ఇక సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీ వైపు వచ్చిన శివ బాలాజీ నటి మధుమిత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వారి లవ్ స్టోరీ, వైవాహిక జీవితం గురించిన ముచ్చట్లను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మధు శివబాలాజీ పంచుకున్నారు.

మధుతో పెళ్లి జరిగితే అమ్మ చనిపోతుందని…

సినిమా కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ సినిమా ఫ్లాప్ అయ్యాక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదట శివ బాలాజీకి. చిన్నప్పటి నుండి కంఫర్టబల్ లైఫ్ లో పెరిగిన బాలాజికి డబ్బు లేక చిన్న రూమ్ లో అద్దెకి ఉంటూ రోజు ఒక పూట మాత్రమే తిని ఉండేవాదట. విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తుండేవాడట. ఇక మళ్ళీ ఆర్య సినిమాలాంటి సినిమా రావడం, హిట్ అయ్యాక వెనక్కి తిరిగి చూసుకోలేదంటూ బాలాజీ చెప్పారు. మరోవైపు తమిళంలో తనతో పాటు కలిసి నటించిన కో స్టార్ మధుమిత ను ప్రేమించాడు శివ బాలాజీ.

ఆమెకు ప్రపోజ్ చేయడం, ఒప్పించడం అన్ని అయ్యాక ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించాలనుకుంటే బాలాజీ వాళ్ళ ఇంట్లో జాతకాలను బాగా నమ్ముతారట. అలా మధుమిత జాతకం ప్రకారం శివ బాలాజీ పెళ్లి మధు మితతో జరిగితే బాలాజీ తల్లి మరణిస్తుందని చెప్పారట. ఇదే విషయం మధుమిత తో చెప్పి బ్రేక్ అప్ అయ్యారట శివ బాలాజీ. ఇక ఏడాది పాటు ఇద్దరూ కలుసుకోలేదు మాట్లాడలేదు. ఆ ఏడాది సమయంలో మధుమిత కూ పెళ్లి చేయాలని వాళ్ళింట్లో వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆమె నిరాకరించడం బాగా డిప్రెషన్ లో ఉండేదట. ఇక ఒక సంవత్సరం అయ్యాక మా ఎల్వక్షన్ సమయంలో ఓటు వేయడాని ఖచ్చితంగా మధుమిత వస్తుందని తన కోసం ఎదురుచూసి శివ బాలాజీ మళ్ళీ ఆమెతో మాట్లాడారట. ఏడాదిలో తాను ఏం చేస్తుంది అన్న విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకున్న బాలాజీ ఏడాదిలో తాను పెళ్లి చేసుకుంటే సైలెంట్ గా ఉండిపోవాలి లేదంటే ఇక తననే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడట. అలా మళ్ళీ ఇద్దరూ ఒక్కటయ్యారు.