Sivaji Raja : తెలుగు సినిమాల్లో విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పలు పాత్రల్లో నటించి మెప్పించిన వ్యక్తి శివాజీ రాజా ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలను చేస్తూ ప్రేక్షకులలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. శివాజీ రాజా దాదాపు 400 సినిమాల్లో నటించారు. ఇక బుల్లితెర మీద పలు సీరియల్స్ లో కూడా నటించిన అయన అమృతం, ఆలస్యం అమృతం, పండు మిరపకాయ్, పాపం పద్మనాభం వంటి సీరియల్స్ తో బుల్లితెర మీద కూడా మంచి హిట్స్ అందుకున్నాడు. ఇక ఇండస్ట్రీ లో ఎవరు ఎలా స్పందిస్తారో సహాయం చేయడంలో ముందేవరుంటారో అన్న విషయాల గురించి మాట్లాడారు శివాజీ.

ప్రభాస్ రాయల్ గా ఉంటాడు…
ఇండస్ట్రీ లో ఏదైనా సహాయం కావాలి అన్నపుడు ఈవెంట్స్ పెట్టడం లాంటి కార్యక్రమాల ద్వారా డబ్బును వసూలు చేస్తాం. అలా ప్రభాస్ దగ్గరికి వెళితే ఎందుకు అదంతా నేను ఇచ్చేస్తాను ఎంత కావాలో చెప్పండి అని ఇచ్చేస్తాడు. స్వయంగా నాకే ఇలాంటి అనుభవం ఉంది అంటూ శివాజీ రాజా తెలిపారు. శివాజీ రాజా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అసోసియేషన్ లో డబ్బులు ఎవరికో సహాయం చేయడానికి వసూలు చేసేటపుడు ప్రభాస్ దగ్గరికి వెళితే కోటి రూపాయలు ఇచ్చాడు.

నన్ను అడిగితే ఇస్తా కదా మళ్ళీ ఈవెంట్లు అంటూ ఎందుకు అన్నాడు చాలా రాయల్ గా ఉంది అతని మనసుకుడా అంటూ చెప్పారు. సినిమాల్లో నటన వాటి పరంగా నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం కానీ రియల్ లైఫ్ లో మాత్రం ప్రభాస్ చాలా మంచివాడు అందుకే అతనంటే ఇష్టం అంటూ చెప్పారు. ఇండస్ట్రీ లో ఏదైనా అవసరం ఉంది అంటే మొదట పలికేది ఇప్పటితరం వారిలో ప్రభాస్ ముందుంటాడు అంటూ చెప్పారు.

































