అందరికి ఒకే పనిముట్లు, ఒకే టవల్…!! కటింగ్ షాప్ కి వెళ్లినందుకు 6 గురికి కరోనా పాజిటివ్…!

0
352

కరోనా దేశవ్యాప్తంగా తన పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. గత గొద్దిరోజులుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినా కూడా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లా భర్గావ్ అనే గ్రామంలో బార్బర్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇటీవలే ఒక యువకుడు ఇండోర్ నుంచి తన స్వస్థలానికి వచ్చాడు. ఆ తరువాత ఏప్రిల్ 5న బార్బర్ షాపుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తరువాత అతనికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి కరోనా టెస్టు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా అతని నుంచి ఆ షాపుకు వెళ్లిన మరో ఐదు గురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వారితో కాంటాక్ట్ ఉన్న మరో 12 మందిని క్వారంటైన్ కు తరలించి, గ్రామం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. అయితే బార్బర్ షాపులో వీరందరికి ఒకే పనిముట్లు, ఒకే టవల్ వాడినట్టు ప్రాధమికంగా నిర్ధారణ అయింది. అందువల్ల ఈ కరోనా తగ్గే వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 1952 పాజిటివ్ కేసులు కామోదుకాగా, అందులో 92 మంది మృతి చెందారు. మరో 210 మంది ఈ మహమ్మారినుంచీ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here